Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

డిసెంబర్ చివరిలోపు నాట్లు ముగించుకోవాలి

kavita

మనతెలంగాణ/నిజామాబాద్ బ్యూరో

తెలంగాణలో సహజంగా ఏప్రిల్ నెలలో వడగళ్ల వానలు, అకాల వర్షా లు వస్తాయని ఈ లోపునే పంటల కోత ముగియాలంటే డిసెంబర్ చివరి లోపు నాట్లు ముగించుకోవాలని ఆ విధంగా రైతులను చైతన్యం చేయా ల్సి ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులకు సూచించారు. నిజామాబాద్‌లోని ప్రగతిభవన్‌లో జరిగిన సాగునీటి సలహా సంఘం సమావేశంలో మంత్రి మాట్లాడుతూ యాసం గిలో రైతులకు కావాల్సిన విత్తనాలకు లోటులేదని, రైతులు తమకు కావాల్సిన విత్తనాలను స్థానిక వ్యవసాయశాఖ అధికారులను సంప్రది ంచి తీసుకోవాల్సిందిగా కోరారు. ఆరుతడి పంటలకు వరినారిమల్లు కోసం రేపటి నుండే నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేస్తా మని మంత్రి చెప్పారు. ప్రాజెక్టులో సరిపడ నీరు ఉన్నందున యాసంగి పంట లకు ఢోకా లేదని కొన్ని గ్రామాల్లో రైతులు ఆరుతడి పంటలుగా మొక్క జొన్నను సాగుచేయడానికి ఆసక్తి చూపుతున్నారని అదే విధంగా డిసెంబర్ 15 నాటికి వరినాట్లు సిద్ధం చేసుకోవడానికి నారుమళ్లు సిద్దం చేయాలని అందుకే పరిమితంగా నీటిని వదలాలని అధికారులను ఆయ న ఆదేశించారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వానకాలం వరిపంట కోతలు ముగియలేదని కొంత మంది రైతులు మాత్రం ముందస్తుగానే నాట్లు వేసుకోవడానికి సిద్ధమవుతున్నారని డిసెంబర్ 1 నుండి పూర్తి స్థాయిలో నీటిని వదులాలని నిర్ణయించినట్లు మంత్రి పోచారం తెలిపా రు. నిజా ంసాగర్ ఆయకట్టుతో పాటు గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాల కింద యాసంగిలో సాగునీటిని అందిస్తామని మంత్రి తెలిపా రు. సమా వేశంలో నిజామాబాద్ ఎంపి కవిత, రాజసభ్య సభ్యుడు డి. శ్రీనివాస్, నిజామాబాద్ పట్టణ, గ్రామీణ, ఆర్మూర్, బాల్కొండ, ఎల్లా రెడ్డి, జుక్కల్ శాసన సభ్యులు గణేష్‌గుప్త, బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంత్‌షిండే, జిల్లా పరిషత్ చైర్మన్ ధపేదర్ రాజు, మండలి సభ్యులు విజిగౌడ్, డిసిసిబి చైర్మన్ గంగాధర్, నిజా మాబాద్, కామారెడ్డి కలెక్టర్లు ఎ. రవీందర్‌రెడ్డి, సత్యనారాయణ, బోధన్ సబ్ కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఇరిగేషన్, అధికారులు పాల్గొన్నారు.

Comments

comments