Search
Monday 11 December 2017
  • :
  • :

మొక్కలకు చూపండి లెక్కలు

PANTS

*ఆగ్రహించిన కలెక్టర్
*హరితహారంపై ప్రత్యేక దృష్టి
*హరితం…అధ్వాన్నం
*పాడవుతున్న వేలాది మొక్కలు
*చెత్తకుప్పల్లో వృథాగా పడేసిన వైనం
*తప్పులు లెక్కలతో రికార్డులు
*జిల్లాలో హరితంపై కలెక్టర్ దృష్టి
*నిర్లక్షంపై మంత్రి పోచారం సీరియస్

మన తెలంగాణ/ బాన్సువాడ: రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ఉమ్మడి జిల్లాల్లో అభాసుపాలవుతోంది. రికార్డుల్లో చూపిన విధంగా నాటిన మొక్కలు పాదుకోలేకపోయాయి. పర్యవేక్షణ కరువై ఎండిపోతున్నాయి. అధికారులు తప్పు డు లెక్కలు చూపుతూ జిల్లా అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. నర్సరీలలో నుండి బయటకు వచ్చిన మొక్కలు ఎక్కడ పెట్టారో కూడా లెక్కలు చేయడం లేదు. ప్రతి మొక్కలకు పక్కాగా లెక్క చూపించాలన్న కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ అయ్యాయి. కార్యక్రమ ప్రా రంభంలో ఉన్న శ్రద్ధ్ద వాటి సంరక్షణపై కనిపించడం లేదు. హరితహారం అనే విషయాన్ని అధికారులు మరిచి పోయారు.
జిల్లాను హరితవనంగా మార్చాలన్న సంకల్పా న్ని సాధించుకునేందుకు ఇటు రాష్ట్ర మంత్రి పోచారం…అటు జిల్లా కలెక్టర్ సత్యనారాయ ణ ప్రత్యేక శ్రద్ద చూపినా క్షేత్ర స్థాయిలో అంతగా ఫలితాలు కనిపించడం లేదు. అందుకోసం ఆ విషయంలో నిర్లక్షం వహించే అధికారులపై చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడొద్దన్న ఆలోచనకు వచ్చారు. నాటిన ప్రతి మొక్క బతికే విధంగా చూడాలని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హరిత వాస్తవ పరిస్థితులపై అధ్యయ నం చేయాలని తుది నివేదికలు తయారు చే యాలని ఆయా

Comments

comments