Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

సిరి సంపదల కొండ

siri

గత వైభవనానికి కర్మాణం ఈ గ్రామం
ఎన్నో ప్రత్యేకతలు విశేషాలు

మన తెలంగాణ / సిరికొండః చుట్టూ కొండలు మధ్యలో ఓ గ్రామం ఎందరో రాజుల పాలన కేంద్రం అది. అక్కడి వారసంతలో బంగారు వెంటి నాణేలతో సరకులు తీసుకెళ్లే వారు. అందుకే ఆ గ్రామానికి సిరికొండ అని పేరు. దానికి సాక్షంగా ప్రస్తుతం అక్కడ లభిస్తున్న ఆదారాలు ఎన్నో. నేడు కుండల కేంద్రంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా సిరికొండ గ్రామం చారిత్రత్మక విశేషలు కొన్ని.. సిరికొండ గ్రామాన్ని ఎందరో రాజులు పరిపాలించారు దానికి ఇక్కడ ప్రాచిన కట్టడాలు నిదర్శనంగా ఉన్నాయి. ఆలయాలు, బురుజులు, కోటలే సాక్షం. ఇక్కడి మరో ప్రత్యేకత మహాలక్ష్మీ అమ్మవారు. కొర్కెలు తీర్చే అమ్మవారిగా భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తుంది. దీంతో జిల్లా నలుమూలాల నుంచి భక్తులు వచ్చి ఇక్కడి అమ్మవారికి పూజలు చేస్తారు. వెండి, బంగారం నాణెలు పునాదులు తవ్వకాల్లో నేటికి ఎక్కువగా లభిస్తున్నాయి. పంట పొలాల్లో చిన్న లింగాలు, రాగి, మట్టి, రాగి నాణెలు ఇలా ఎన్నో గ్రామ ప్రజల కంట పడుతున్నాయి. దాదాపు చుట్టురా 5 కిలో మీటర్ల పరిధిలో సిరికొండ గ్రామం ఉండడంతో తాగు నీటి, సాగు నీటి సమస్య ఉండకుండా గొలుసు కట్టు చెరువులను నిర్మించారు. అప్పటి ప్రతిభకు చెరువలే తర్కణంగా నిలుస్తున్నాయి. ప్రస్తుం మడాం, పాండుగూడ, చెరువులు కొండాపూర్ చెరువులు నీటితో కళకళ లాడుతున్నాయి. ప్రస్తుం సిరికొండ అభివృద్ది చెందుతూ 60 గ్రామాలకు ప్రధాన ఆధరంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం మండల కేంద్రం ప్రకటించింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువలను పునరుద్దించారు.

Comments

comments