Search
Monday 19 March 2018
  • :
  • :
Latest News

సైనికుల సేవలు మరువలేనివి

ministerమంత్రి అల్లోల

మన తెలంగాణ/నిర్మల్‌టౌన్ : దేశరక్షణకై సైన్యం అహర్నిషలు శ్రమిస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నా రు. బుధవారం నిర్మల్ జిల్లా ని ర్మల్ పట్టణంలోని సోఫినగర్ లో మాజీ సైనికుల జిల్లా సం ఘ భవనముకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ సైన్యం దేశాన్ని కంటికి రెప్పలా తమ నిరంతర నిఘాతో కాపాడుతోందని వారి సేవలు, త్యాగాలు మరువలేనివని తెలిపారు. దేశంలో శాంతి భద్రతలు ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. సైనిక సంఘ భవనానికి రూ.25 లక్షల మంజూరు చేయిస్తామన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి మాట్లాడుతూ దేశంలో సైనికుల వలనే ప్రజలు సంతోషంగా ఉన్నారని, సంఘభవనానికి రోడ్డు, విద్యుత్ సరఫరా ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, ఎఫ్‌ఎస్‌సిఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, భూపతిరెడ్డి, ప్రభాకర్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments