Search
Thursday 22 February 2018
  • :
  • :

భూ ప్రక్షాళనతో సమస్యల పరిష్కారం

mchl

మేడ్చల్ : భూ రికార్డుల ప్రక్షాళనతో భవిష్యత్తులో భూముల వివాదాలు రైతులు లేకుండా సమస్యలు పరిష్కరించబడుతాయని రైతులు తమ తమ భూముల రికార్డులను సరిచేసుకోవాలని తహశిల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు. మండలంలోని గుండ్లపోచంపల్లిలో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని సర్పంచ్ భేరీ ఈశ్వర్‌తో కలిసి తహశిల్దార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా భూముల రికార్డులను సరిచేయలేదని ప్రస్తుతం చేపడుతున్న భూముల రికార్డుల ప్రక్షాళనతో సమస్యలు పూర్తిస్థాయిలో తొలిగిపోతాయని తెలిపారు. రైతులు తమకు సంబంధించిన రికార్డులను సరిచూసుకొని ఏవైన సమస్యలు ఉంటే వాటి వివరాలను ఫామ్ 1బిలో వివరించి అధికారులకు అందజేయాలని సూచించారు. సమస్యలను పరిశీలించి వాటి పరిష్కారాలకు అధికారులు కృషి చేస్తారని అన్నారు. భవిష్యత్తులో ఎవ్వరికి భూ రికార్డుల సమస్యలు తలెత్తకుండా పారదార్శకంగా భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భేరి ఈశ్వర్, ఎంపిటిసిలు అమరం మోహన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, ఉపసర్పంచ్ బట్టికాడి దేవేందర్‌ముదిరాజ్, మాజీ ఉపసర్పంచ్ సాయిపేట యాదగిరి, టీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు గడీల కృష్ణారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు దొడ్ల మల్లిఖార్జున్‌ముదిరాజ్,  వార్డు సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments