Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

కొత్తగా.. గొప్పగా

kcr2

మారిన పరిస్థితులకు అనుగుణంగా నూతన పంచాయతీరాజ్ చట్టం

పంచాయతీలకు కొన్ని బాధ్యతలు తొలగాయి, మరికొన్ని వచ్చాయి
అందుకు తగినట్లుగా కొత్త చట్టం రూపకల్పన జరగాలి
ప్రగతి భవన్ సమీక్షలో ముఖ్యమంత్రి కెసిఆర్

హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల కు అనుగుణంగా కొత్త పంచాయతీరాజ్ చట్టం రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమలులో ఉన్న పంచాయతీరాజ్ చట్టం రూపొందించినప్పుటి పరిస్థితులు ఇప్పుడు లేవని, మారిన పరిస్థితులను బేరీజు వేసుకొని కొత్త చట్టం తయారుకావాలన్నారు. ప్రగతిభవన్‌లో శనివారం పంచాయితీరాజ్ చట్టం రూపకల్పన, గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే అంశంపై సిఎం సమీక్ష నిర్వహించారు. చట్టం తయారు చేసినప్పుడు గ్రామపంచాయతీలు ఎలాంటి విధులు నిర్వహించాలనే విషయంపై అనేక విధివిధానాలు, మార్గదర్శకాలు రూపొందించారని సిఎం అన్నారు. తదనంతర కాలంలో అనేక మార్పులు వచ్చాయని, పం చాయతీలకు కొన్ని బాధ్యతలు తొలగాయని, మరికొన్ని బాధ్యతలు పెరిగాయని సిఎం అన్నారు. గతం లో మంచినీటి సరఫరా గ్రామపంచాయతీ పరిధిలో ఉండేదని, మిషన్ భగీరథ ద్వారా ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుంటున్నదని చెప్పారు. ప్రజావైద్యం, రహదారుల నిర్మాణం, చెరువుల నిర్వహణ, మంచినీటి సరఫరా తదితర అంశాలు ఇప్పుడు ఆయా శాఖ ల పరిధికి వెళ్లాయని పేర్కొన్నారు. పచ్చదనం పెం చడం, పరిశుభ్రత కాపాడడం, జనన, మరణ, వివా హ రిజిస్ట్రేషన్లు చేయడం, స్మశాన వాటికల నిర్మా ణం, నిర్వహణ, డంపు యార్డుల ఏర్పాటు, గ్రామ ప్రణాళికల తయారీ వంటి కొత్త బాధ్యతలు వచ్చి చేరాయని సిఎం అన్నారు. గతంలో పంచాయతీలకు ఉన్న ఆదాయ వనరులకు, ఇప్పుడున్న మార్గాలకు వ్యత్యాసం ఉందని, దానికి అనుగుణంగా పంచాయతీలు చేయాల్సిన పనులు ఉంటాయని సిఎం చెప్పా రు. గ్రామ పంచాయతీలకు నిర్ధిష్టమైన విధులు, నిధులు, బాధ్యతలు అప్పగించాలని, పని చేసే పం చాయతీరాజ్ వ్యవస్థను తీసుకురావాలని, ఇందుకు అనుగుణంగా కొత్త చట్టం రూపకల్పన జరగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీశ్ శర్మ, సలహాదారు చెల్లప్ప, ఎంపి వినోద్ కుమార్, పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూప్రసాద్, డిప్యూటీ కమిషనర్లు పి.రామారావు, కె.సుధాకర్, రంగారెడ్డి డిపిఓ కె.పద్మజారాణి, మెదక్ డిపిఓ సురేష్ మోహన్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ కన్సల్టెంట్లు పాల్గొన్నారు.

Comments

comments