Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ

meeing

*ప్రజలు కోరిన మొక్కలనే నర్సరీలలో పెంచాలి
*2017లో నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
*రెవెన్యూ ఫ్లాంటేషన్‌కు 30లక్షల మొక్కలు అందుబాటులో వున్నాయి
*ఎస్‌డిఎఫ్ నిధులను హరితహారానికి వినియెగించండి

మన తెలంగాణ/సూర్యాపేట ః ఎవెన్యూ ప్లాంటేషను పెద్ద ఎత్తున చేపట్టేందకు అటవీ శాఖ నర్సరీలలో 30లక్షల మొక్కలు అందుబాటులో వున్నట్లు జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్ తెలిపారు. సూర్యాపేట- జనగామ రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ ప్రక్రియ పూర్తి అయినందున రోడ్లకు ఇరువైపుల ఎవెన్యూ ప్లాంటేషను చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. కోదాట-మేళ్ళ చెరువు రహదారిలో వున్న అంతరాలలో మొక్కలు నాటించాలని తెలిపారు. అలాగే మట్ల నుండి నల్లబండగూడెం వరకు వున్న జాతీయ రహదారి ఇరువైపుల పచ్చదనంతో నిండుగా కనిపించేందుకు నాటిన మొక్కలను సంరక్షించాలని జియంఆర్ అధికారురను ఆదేశించారు. రెవెన్యూ ప్లాంటేషన్ క్రింద నాటిన ప్రతి వంద మొక్కలకు ఒక ఉద్యోగిని భాద్యులుగా నియమించినున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ పైపుల నిర్మాణంలో కోల్పొయిన మొక్కల స్ధానంలో కోత్తగా మొక్కలను నాటించాలని తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ నందు యంపిడివోలు, ఇజియస్ ఎపివోలతో నిర్వహించిన సమావేశంలో హరితహరం, మరుగుదొడ్ల నిర్మాణం, డంపింగ్‌యారర్డల ఏర్పాటు, గ్రామపంచాయతీల భవనాల నిర్మాణం పనుల ప్రగతిని జిల్లా కలెక్టర్ సమీక్షించారు. 2018 హరితహరం అమలుకు గ్రామస్ధాయి హరితరక్షణ కమిటీలను సర్పంచుల అధ్యక్షతన నర్విహించాలని యంపిడివోలను  జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఒక నర్సరీ ఏర్పాటు చేసి, ప్రజలు కోరు కునే మొక్కలనే పెంచి అందజేయాలని తెలి పారు. ప్రత్యేక అభివృద్ధి నిధుల నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు జిల్లాలోని గ్రామ పంచాయతీలకు రూ. 15లక్షల చోప్పున,
తండాలకు రూ.10లక్షల చోప్పున మొత్తం రూ.25కోట్ల నిధులను మంజూరు చేశారని తెలిపారు. రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి చొరవతో ఈనిధులు మంజూరు అయినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న హరితహరం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పరంగా అందుబాటులో లేని పంట్ల మొక్కలను ఇచ్చేందుకు అవసరమైన నిధులను గ్రామపంచాయతీలు, తండాలకు ప్రత్యేకంగా విడుదల చేసిన నిధుల నండి వినియోగించేందుకు గ్రామ పంచాయతీలలో తీర్మాణాలు చేయించాలని యంపిడివోలకు సూచించారు. అభివృద్ధి అంటే రోడ్లు, భవనాల నిర్మాణమే కాదని, హరితహరం కూడా అభివృద్ధిలో భాగామేనని పేర్కోన్నారు. విధుల పట్ల నిర్లక్షంగా వ్యవహరించే ఉపాధి హామీ క్షేత్ర సహయకులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిఆర్‌డివో కిరణ్‌కుమార్‌ను జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. వారి పనితీరును రెగ్యులర్‌గా సమీక్షించాలని యండివోలకు సూచించారు. తీసుకునే వేతనమునకు తగిన విధంగా పని చేసైనే క్షేత్ర సహయకులు కోనసాగుతారని స్పష్టం చేశారు. నిర్లక్షంగా వుండే కేత్ర సహాయకుల వేతనాలను నిలుపుదల చేయాలని ఆదేశించారు. 2017లో 3955 ప్రదేశాలలో నాటిన మొక్కల సంరక్షణ పనులను, కూలీలకు అప్పగిస్తూ, మానిటరింగ్ చేసే భాద్యత క్షేత్ర సహయకులదేనని తెలిపారు. హరితహరం మొక్కలను 76శాతం జియోట్యాంగింగ్ జరిగిందని, దానిని 85శాతానికి పెంచాలని తెలిపారు. డంపియార్డుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని గ్రామపంచాయతీకుసరఫరా చేసిన చెత్త సేకరణ రిక్షాల వినియోగానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామపంచాయతీ, అంగన్‌వాడీ, ఇతర ప్రభుత్వ కార్యాలయాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి మంజూరుకై ప్రతి పాదనలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈసమావేశంలో డిఆర్‌ఢివో యస్.కిరణ్‌కుమార్, డిఎఫ్‌వో ప్రవీణ్, డిపివో రామోహన్‌రాజు, పంచాయతీరాజ్, ఇఇ సంగమేశ్వర్‌రావు, ఎక్త్‌జ్ పర్యవేక్షక్షులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments