Search
Wednesday 22 November 2017
  • :
  • :

దుమ్మురేపిన స్పైస్‌జెట్

క్యూ2లో 79 శాతం పెరిగిన నికర లాభం

Spice-Jet

న్యూఢిల్లీ : బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ క్యూ2(జులైసెప్టెంబర్) ఫలితాల్లో అద్భుతంగా రాణించింది. సంస్థ నికర లాభం రూ.105.28 కోట్లతో 79 శాతం వృద్ధిని సాధించింది. అత్యధిక ప్యాసింజర్ రెవెన్యూ, వ్యయాలు తగ్గుముఖం పట్టడం స్పైస్‌జెట్ కలిసివచ్చింది. మొత్తం ఆదాయం రూ.1,838.49 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.58.91 కోట్లు.. అయితే ఒక్కసారిగా రెట్టింపు అయింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ2లో స్పైస్‌జెట్ నికర లాభం 78 శాతం ఎగసింది. కంపెనీ మొత్తం ఆదాయం కూడా 30  శాతం వృద్ధితో రూ. 1,815 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) 40 శాతం పెరిగి రూ. 156 కోట్లయ్యింది. ఇబిటా మార్జిన్లు 7.9 శాతం నుంచి 8.6 శాతానికి బలపడ్డాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం బిఎస్‌ఇలో ఈ షేరు 6.8 శాతం జంప్‌చేసి రూ. 149 వద్ద ముగిసింది. తొలుత రూ.152 వరకూ ఎగసింది.

Comments

comments