Search
Wednesday 22 November 2017
  • :
  • :

కోహ్లిసేన కోసం శ్రీలంక ప్రత్యేక వ్యూహం

sriకోల్‌కతా: కోహ్లీ సేనలో ప్రతి ఒక్క ఆటగాడి కోసం ప్రత్యేక వ్యూహం సిద్ధం చేసుకుని వచ్చినట్లు శ్రీలంక జట్టు బౌలింగ్ కోచ్ రుమేశ్ రత్నాయకే తెలిపారు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్టు ఈ నెల 16న ఈడెన్‌గార్డెన్స్‌లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో లంక బౌలింగ్ కోచ్ రుమేశ్ మాట్లాడుతూ ‘భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ కోసమే కాదు జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడి కోసం ఒక్కో వ్యూహం సిద్ధం చేసుకుని వచ్చాం. ఆ వ్యూహాలేమిటో ఇప్పుడే చెప్పం. నేరుగా మ్యాచ్‌లోనే ప్రయోగిస్తాం. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? అనేది కూడా అప్పుడే తెలుస్తోంది. గతంలో భారత్‌పై 5టెస్టుల సిరీస్‌ను 0-5తో ఓడిపోయినా, ఇటీవల పాకిస్థాన్‌పై 2-0తో సిరీస్ సొంతం చేసుకున్నాం. దురదృష్టవశాత్తూ ఇప్పటి వరకు భారత గడ్డపై మేము ఒక్క టెస్టు కూడా గెలవలేదు. ఈ పర్యటనలో గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇరు జట్లలో చైనామన్ బౌలర్లు ఉన్నారు. ఈ ఇద్దరూ క్రికెట్ దిగ్గజం బ్రాడ్ హాగ్ నుంచే సలహాలు తీసుకున్నారు’ అని తెలిపారు.‘భారత గడ్డపై టెస్టు సిరీస్ మాకెంతో లాభదాయకం. అగ్ర జట్టుతో ఆడితే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. భారత్‌తో ఇప్పటి టెస్టు సిరీస్ మాకు సవాలుతో కూడుకున్నది. తొలి టెస్టులో గెలిచి మా పేరిట ఉన్న చెత్త రికార్డును తుడిపేస్తాం’ అని రుమేశ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Comments

comments