Search
Wednesday 22 November 2017
  • :
  • :

లంకను తేలిగ్గా తీసుకోం:రహానె

rahane

ఈ నేపథ్యంలో ఇరుజట్ల ఆటగాళ్లు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటున్నారు. తాజాగా క్రికెటర్ రహానె మీడియాతో మాట్లుడాడు. ‘ప్రస్తుతం మన జట్టు చాలా బాగుంది. ఫార్మాట్ మారినా మన ఆటగాళ్లు త్వరగానే అందుకు అనుగుణంగా మారిపోతున్నారు. ఇందులో ఎలాంటి సమస్య లేదు. సోమవారం మా ప్రాక్టీస్ సెషన్ గొప్పగా సాగింది. ఈ రోజు, రేపు కూడా మేము ప్రాక్టీస్‌లో పాల్గొంటాం. సిరీస్‌లో తొలి మ్యాచ్ ఎప్పుడూ కీలకమే. ఇందులో గెలిచి సిరీస్‌కు మంచి ఆరంభాన్ని ఇవ్వాలని ఇరు జట్లు భావిస్తాయి. శ్రీలంకలో జరిగిన గత సిరీస్‌కు ఈ సిరీస్‌కు చాలా వ్యత్యాసం ఉంది. సొంతగడ్డపై పిరీస్ జరుగుతున్నా, లంకను తేలిగ్గా తీసుకోం. వారు కూడా పోరుకు సిద్ధమౌవుతున్నారు. భారత గడ్డపై టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలని వారు భావిస్తున్నారు. ఈ సిరీస్‌లో ప్రత్యర్థి జట్టు వ్యూహాల గురించి ఆలోచన మాని మా ఆట మేము ఆడతాం. దక్షిణాఫ్రికా వెళ్లిన తర్వాత ఆ సిరీస్ గురించి ఆలోచిస్తామని రహానె తెలిపాడు.

Comments

comments