Search
Thursday 22 February 2018
  • :
  • :
Latest News

రాష్ట్ర ప్రణాళిక అభివృద్ధికి   చర్యలు చేపట్టాలి

swamy

పురపాలక శాఖ మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/జగిత్యాల: రాష్ట్ర ప్రణాళికాభివృద్ధికి చర్యలు చేప ట్టాలని రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ల తో స్వచ్ఛ భారత్, నగర పాలక సంస్థలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,కేంద్ర ప్రభుత్వం స్వచ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా జనవరి నుంచి స్వచ్చ సర్వేక్షన్ కార్యక్రమం చేపట్టనుందని దీనిపై జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమి షనర్లతో సమావేశమై తదనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. దీనిపై ప్రత్యే దృష్టి సారించాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రం లో 15వేలకు పైగా జనాభా ఉన్న గ్రామాల జాబితా సమర్పించా లన్నారు. రాష్ట్రంలో 73అర్బన్ లోకల్ బాడీలున్నాయని, అర్బన్ లోక్ బాడీలు సమగ్రాభివృద్ధికి మూడు నుంచి ఐదు కిలోమీటర్ల ప రిధిలో ఉన్న గ్రామ పంచాయతీల విలీనానికి ప్రతిపాదనలు సమ ర్పించాలన్నారు. అర్బన్ లోకల్ బాడీలు ప్రకటించేందుకు ప్రతిపా దనలు పంపించాలని ఆయన సూచించారు.   అర్బన్ లోకల్ బాడీల బలోపేతంతో అభివృద్ధి సాకారమవుతుం దన్నారు. జూలై 2018 నాటికి గ్రామ పంచాయతీ పాలకమండలి కాల పరిమితి ముగుస్తున్నందున ప్రత్యేక అధికారుల నియామా కానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫ రెన్స్‌లో జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ, ఆదేశాల మేరకు వెంట నే చర్యలు చేపడతామన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో జగిత్యాల, కోరు ట్ల, మెట్‌పల్లి మున్సిపల్ కమిషనర్లు సంపత్‌కుమార్,వాణి, నర్స య్యలు పాల్గొన్నారు.

Comments

comments