Search
Wednesday 22 November 2017
  • :
  • :

ఇప్పటికీ ఫిక్సింగ్ ఉంది!

ckt

వఖార్ యూనిస్ సంచలన ప్రకటన
 ఫిబ్రవరి 23 నుంచి పిఎస్‌ఎల్ మూడో ఎడిషన్

ఇస్లామాబాద్: 2018లో పాకిస్థాన్ సూపర్ లీగ్(పిఎస్‌ఎల్) జరగనున్న నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వఖార్ యూనిస్ ఆదివారం పెద్ద సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికీ క్రికెట్ అన్ని స్థాయిల్లో ఫిక్సింగ్ ఉందని అన్నారు. ఫిక్సింగ్ జాఢ్యాన్ని నిర్మూలించడానికి సమిష్టి కృషి అవసరమని చెప్పారు. పాకిస్థాన్ జాతీయ జట్టుకు కోచ్‌గా పనిచేసిన ఆయన ‘పాకిస్థాన్ క్రికెట్ ఇమేజ్‌ను స్పాట్ ఫిక్సింగ్ దెబ్బతీసింది’ అన్నారు. ‘ఫిక్సింగ్ వేళ్లు చాలా లోతుగా ఉన్నాయని, ఇప్పటికీ అన్ని స్థాయిల్లో ఉందని’ చెప్పుకొచ్చారు. ఇస్లామాబాద్ యూనైటెడ్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా మీడియానుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ విషయం చెప్పారు. పిఎస్‌ఎల్ మూడో ఎడిషన్‌లో ఇస్లామాబాద్ యూనైటెడ్ జట్టుకు వఖార్ యూనిస్ డైరెక్టర్‌గా ఉన్నారు. స్పాట్ ఫిక్సింగ్ విషయంలో తాను యువ క్రికెటర్లపై నిఘా పెడతానని, ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహిస్తానని యూనిస్ చెప్పారు. ‘క్రికెటర్లకు మైదానంలోనూ, బయటా మార్గదర్శకత్వం నెరపడమే తన ప్రధాన ధ్యేయం అని, క్రికెట్ ఆటలో అవకతవకలు ఎలా వదిలించుకోవాలి, అవి కేరీర్‌ను ఎలా పాడుచేస్తాయో చెబుతాను’ అని వఖార్ యూనిస్ చెప్పారు. 2016లో తొలి పిఎస్‌ఎల్ ఎడిషన్‌ను ఇస్లామాబాద్ యునైటెడ్ గెలుచుకుంది. తర్వాత 2017లో పెషావర్ జల్మీ టైటిల్‌ను గెలుచుకుంది. ఇక మూడో సీజన్ ఫిబ్రవరి 23న దుబాయ్‌లో ఆరంభం కానుంది. మూడో ఎడిషన్‌ను దుబాయ్ నిర్వహిస్తోంది. ఈ టోర్నమెంట్‌లో చాలా మంది విదేశీ క్రికెటర్లు పాల్గొననున్నందున పాకిస్థాన్ అంతర్జాతీయ క్రికెట్ పునరుద్ధరణకు అది తోడ్పడగలదన్న ఆశాభావాన్ని వఖార్ యూనిస్ వ్యక్తం చేశారు. త్రీమ్యాచ్ టి20 సిరీస్ కోసం వరల్డ్ 11 టోర్నమెంట్‌ను సెప్టెంబర్‌లో పాకిస్థాన్ నిర్వహించింది. దాని తర్వాత శ్రీలంకకు వ్యతిరేకంగా ఓ మ్యాచ్‌ను కూడా నిర్వహించింది. ‘ లాహోర్‌కు శ్రీలంక జట్టు వస్తోంది. దానికి ముందు వరల్డ్ 11 సిరీస్, పిఎస్‌ఎల్ ఫైనల్ జరగనున్నాయి. ఇవన్నీ పాకిస్థాన్‌పై ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేయనున్నాయి. విదేశీ క్రికెటర్లు భద్రతా భయాలేవి లేకుండా పాకిస్థాన్ పర్యటించాల్సిందిగా మేము నచ్చజెబుతున్నాం’ అని వఖార్ తన ప్రసంగాన్ని ముగించారు.

Comments

comments