Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

అవస్థల్లో కస్తూర్బాగాంధీ విద్యార్థినులు

kasturba

మనతెలంగాణ/మర్పల్లి ః మర్పల్లి మండలకేంద్రంలోని కస్తూర్భాగాంధీ ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినులకు అన్ని ఇబ్బందులే ఎదురవ్వడంతో చదువుపై దృష్టి సారించలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మార్కెట్ సమీపంలో ప్రభు త్వ స్థలం సుమారుగామూడున్నర ఎకరా లస్థలంలో రెండంతస్థుల భవనాన్ని, ప్రహారిగో డను నిర్మించారు. గతంలో ఇక్కడ విద్యార్థిను లకు అన్నిసౌకర్యాలు ఉండేవని, నాలుగునె లల క్రితం ఇక్కడ ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నప్పటినుండి ఇక్కడ పరిపాలన వ్యవహారం అస్తవ్యస్తంగా మారిం దని విద్యా ర్థులు చెబుతున్నారు. అప్పట్లోనే ఇక్కడ ప్రత్యేకాధికారిగా పనిచేసిన ఆమెపై పలు ఆరోపణలు వినిపించాయి. దీంతో ఆమెను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రజాప్రతి నిదులు, జిల్లా అధికారులతో విషయం చెప్పి వారంరోజులకే మల్లి ఇక్కడికే పోస్టింగ్ తీసుకొని జాయినింగ్ అయ్యింది. అయినప్ప టికీ ఇక్కడి సమస్యలు పెరుగుతు న్నాయే కానీ తగ్గడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నా మంచినీటిబోర్‌లో గతంలోకంటే నీరు చాలా తక్కువగా రావడం తో నీళ్లు సరిపోవడం లేదని వారు చెబుతు న్నారు. దీంతో వారు నాలుగైదురోజులకు ఓసారి స్నానం చేస్తున్నా రని వారు తెలిపారు. ప్రతిరోజు ఇచ్చే అన్నం, పూరిలో పురుగులు రావడం, ఎటువంటి కూరగాయలను ఇవ్వ కుండ ప్రతిరోజు చింతచారు ఇవ్వడంతో తిన లేక పోతున్నామని వివరించారు. ఈ విషయం లో పట్టించుకునే వారు లేరు. అంతేకాక ఎస్‌ఓ ఆడిందే ఆట..పాడిందే పాటగా మారింది. గతంలో కంటే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా వస్తున్నారని, ఉన్నవారికి సైతం ఇచ్చే భోజనం, స్నాక్స్‌లు ఇచ్చేవి కూడా చాలా తక్కువ. నాసిరకంగా ఇస్తున్నారని వారు ఆరో పించారు. సంవత్సరం క్రితం విద్యార్థులకు ఫిల్టర్ వాటర్‌ను ఇవావలని ఉద్ధేశంతో సుమా రు మూడులక్షల రూపాయలతో మిషన్‌ను తీసుకొచ్చారు. దానిని కొబ్బరికాయ కొట్టి ప్రా రంభించారు. ఇక అది ఆరోజునుండి మూలకే ఉండిపోయింది. మూడువారాల నుండి భోజ నం బాగాలేక, రెండురోజు లక్రితం అనారో గ్యాలకు గురై మర్పల్లి అసుపత్రిలో చేరడం విదితమే..దీంతో విద్యా ర్థుల తల్లితండ్రులు ఆంధోళనకుగురై పాఠశా లకు వచ్చి తమ పిల్లల యోగక్షేమాలను ఆరాతీస్తు ఇష్టముంటే ఉంచుతున్నారు. లేకుంటే ఇంటికి తీసుకెల్లు తున్నారు. దీంతో 200మంది పిల్ల లో రెండుమూ డురోజులుగా సగంమంది ని వారివారి ఇండ్ల కు తీసుకె ల్లారు. ఇక్కడ జరుగుతున్న వాటిని పూసగు చ్చినట్లు పత్రికల్లో రావడం, విచార ణచేసి ఎస్‌ఓను సరెండర్‌చేయడం తేలిసిందే.
ఇప్పుడైనా పరిస్థితులు మెరుగయ్యేనా?
పాత ఎస్‌ఓను సరెండర్‌చేయడంతో ఇక్కడ ఇన్‌ఛారిజ్జగా కోట్‌పల్లిలో ఎస్‌ఓగా ఉన్న పల్లవిని నియమించారు. పాఠశాలలో ము ఖ్యంగా నాణ్యమైన భోజనంతోపాటు, మెను ప్రకారం ఇవ్వాలని, స్నాక్స్, చికేన్, గుడ్డు, పండ్లు సమాయానికి ఇవ్వాలని, మంచినీ టికోసం మరోబోర్‌నువేయాలని, లేదా ఉన్న దానిని పేష్లింగ్‌చేస్తే కొంతఅదనంగా నీరు వచ్చే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
పాఠశాలను సందర్శించిన రాష్ట్ర కో ఆర్డినేటర్ ః వరకుమార్
రెండుమూడురోజులుగా మర్పల్లి కస్తుర్బాగాంధీ పాఠశాలలో నెలకొన్నటువంటి విషయాలను పత్రికల్లో రావడంతో మంగ ళవారం రాష్ట్ర కస్తుర్భాగాంధీ ఆశ్రమ పాఠశా లలకో ఆర్డినేటర్ వరకుమార్, మోమిన్‌పేట్ సిఐ శ్రీనివాస్‌లు పాఠశాలను సందర్శించారు. ఇక్కడ జరిగిన పూర్తి వివరా లను విద్యా ర్థులను, టీచర్లను అడిగితె లుసుకున్నారు.

Comments

comments