Search
Monday 11 December 2017
  • :
  • :

25వ రోజుకి చేరిన సెర్ప్ ఉద్యోగుల సమ్మె

serp

కీసర:ఉద్యోగ భద్రత కోరుతూ సెర్ప్ హెచ్‌ఆర్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె 25వ రోజుకి చేరింది. ఉద్యోగులు గురువారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టరేట్ ఆవరణలోని చెత్తను సేకరించి నిరసన వ్యక్తం చేశారు. పలువురు సెర్ప్ ఉద్యోగులు రిలే నిరహార దీక్షలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సెర్ప్ ఉద్యోగుల జేఏసీ నాయకులు తౌర్యా నాయక్, హరినాథ్, మంజుల, సభిత తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 4,264 మంది సెర్ప్ ఉద్యోగుల ఐదు సంవత్సరాల కాంట్రాక్టు రెన్యూవల్ పద్దతిని తొలగింస్తూ, సర్వీసును తక్షణమే క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీఎంలు, సీసీలు, డీపీఎంలు, మినిస్ట్రియల్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

comments