Search
Tuesday 12 December 2017
  • :
  • :
Latest News

కామారెడ్డి డిగ్రీ కళాశాల భూమి సర్వేను అడ్డుకున్న విద్యార్థి సంఘాలు

students

కామారెడ్డి: కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూ సర్వేను బు ధవారం విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. 1964 నుండి ఇప్పటి వ రకు ఈ భూములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధీనంలో ఉన్నాయని విద్యార్థి సం ఘాల నాయకులు ఆరోపిస్తూ నిరసనకు దిగారు. దీంతో కామారెడ్డి పోలీసులు  ఎబివిపి, పిడిఎస్, ఎఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ కళాశాల విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసి తరలించారు. కళాశాల చెందిన 8ఎకరాల భూమిని కొందరు వ్యక్తులు కబ్జాచేసేందుకు ప్రయత్నిస్తున్నారని విద్యార్థి సంఘాల ఆరోపిస్తున్నా యి. ఆ భూములు మావే నంటూ హైకోర్టుకు వెళ్లగా కోర్టు స్టే ఇచ్చింది. దీంతో ప్రభుత్వం డిగ్రీ కళాశాల భూములను సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. దీంతో బుధవారం భూ సర్వే రసాభాసగా సాగింది. కోట్లు విలువ చేసే ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఎ న్నో సంవత్సరాల నుండి కళాశాల ఆధీనంతో ఉన్న అడ్డుకున్న విద్యార్థ్ధి సంఘాలు భూములు కళాశాల ఆధీనంలోనే ఉండాలని విద్యార్థి సంఘాల నాయకు లు నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం సర్వే చే సేందుకు వచ్చిన సంబంధిత అధికారులు వెళ్లగా విద్యార్థి సంఘాల నా యకులు అడ్డుకున్నారు. పోలీసులు టిజివిపి జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ నా యక్, ఎఐఎస్‌ఎఫ్ చెలిమెల భాను, ఎఐఎఫ్‌డిఎస్ జబ్బర్ నాయక్, బివిఎస్ బాలు నాయక్, పిడిఎస్‌యు ఆజాద్, సురేష్, విఠల్, ఎన్‌ఎస్‌యుఐ సందీప్, ఎస్‌ఎఫ్‌ఐ అరుణ్, ఎబివిపి సుధీర్ కుమార్‌లను అరెస్ట్ చేశారు.

Comments

comments