Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

విద్యార్థులు చదువుతో పాటు..క్రీడాల్లో రాణించాలి

DEEPAM

గురుకులాల సెక్రటరీ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ 

మన తెలంగాణ / ఉట్నూర్ రూరల్ : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని గురుకులం సెక్రటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్ అన్నారు. సోమవారం మండలంలోని లాల్ గురుకుల కళాశాలలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం పెంపొందించేందుకు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని, దీంతో పాటు చదువులోనూ రాణిస్తూ తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలన్నారు. క్రీడాకారులు ఇలాంటి అవకాశాలు సద్వినియోగం చేసుకొని తమలో దాగి ఉన్న ప్రతిభను బాహ్య ప్రపంచానికి చాటాలన్నారు. విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక నిధులు విడుదల చేస్తూ ఎంతో కృషి చేస్తుందని అన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సన్మార్గంలో నడిచి మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు.
అట్టహాసంగా ప్రారంభం : రాష్ట్ర స్థాయి పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గురుకులాల సెక్రటరీ ప్రవీణ్ జ్యోతి ప్రజ్వలణతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1080 మంది క్రీడాకారులు 169 పాఠశాలల నుంచి పాల్గొంటారు. హ్యాండ్ బాల్, ఖోఖో, క్యారమ్, చెస్, వెల్సాంగ్, ఫుట్‌బాల్‌తో పాటు 12 రకాల అథ్లెట్స్ జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఏటీడబ్లూఏ చైర్మన్ లక్కేరావ్, ఆర్డీవో విద్యా సాగర్, ఎంపీపీ విమల, జడ్పీటీసీ జగ్జీవన్, సర్పంచ్ హరి నాయక్, ఎంపీటీసీ రమేష్, తదితరులు ఉన్నారు.

Comments

comments