Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

భూ ప్రక్షాళనను సద్వినియోగించుకోండి

lady2

*జిల్లా కలెక్టర్ భారతి హొళికేరి
*బస్వాపూర్‌లు భూ ప్రక్షాళన ఆకస్మికంగా తనిఖీ

మనతెలంగాణ/వెల్దుర్తి: భూములకు సంబంధించి రెవిన్యూ రికార్డుల్లో తప్పులతడకగా ఉన్న రికార్డులను సవరించేందుకు ప్రభు త్వం భూప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, దీనిని రైతులు, అన్నివర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ భారతి హొళికేరి పిలుపునిచ్చారు. ఈ మేరకు మండలంలోని బస్వాపూర్ రెవిన్యూ గ్రామంలో కొనసాగుతున్న భూప్రక్షాళన కార్యక్రమాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రైతులకు భూ ప్రక్షాళన వలన కలిగే లాభాలను కలెక్టర్ వివరించా రు. రైతులు సకాలంలో వచ్చి రెవిన్యూ రికార్డుల్లో ఉన్న తప్పొప్పులను సవరించుకోవాలన్నారు. గడువులోపు తప్పులను సవరించుకోకుంటే రికార్డులు యథావిధంగా ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారని ఫలితంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా శతశాతం శౌచాలయాలు నిర్మించుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. బస్వాపూర్‌లో అసంపూర్తిగా నిర్మించిన మరుగుదొడ్లను వెంటనే పూర్తి చేసి వినియోగించుకునేలా చూడాలని ఎంపిడిఓ కృష్ణన్‌కు ఫోన్‌లో ఆదేశించారు. అదేవిధంగా 580సర్వే నంబర్‌లో 400ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉందని కాని ఆన్‌లైన్‌లో 200ఎకరాలు మాత్రమే వస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కుకునూర్ గ్రామానికి చెందిన మల్లేశం, శివరాంయాదవ్‌లు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో విచారించి రికార్డులు తప్పుగా ఉంటే సవరించి ఆన్‌లైన్‌లో పొందుపరిచేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ నిచ్చారు.

Comments

comments