Search
Sunday 20 May 2018
  • :
  • :
Latest News

సామాజిక తెలంగాణ సాధనే పోరుబాటు లక్ష్యం

CPIఉమ్మడి జిల్లాలో ముగిసిన రథయాత్ర
అన్ని దేవాలయాల తరహాలో బాసరను అభివృద్ధి చేయాలి
సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి

మన తెలంగాణ/బాసర : సామాజిక తెలంగాణయే పోరుబాటు రథయాత్ర ఉద్దేశ్యమని సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. వారు శనివారం విలేకర్ల సమావేశంలో ఆలయంలో వేములవాడ అతిథి గృహంలో మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ విద్యార్థులకు ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా మారుస్తున్నారన్నారు. సామాజిక తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం ఉమ్మడి జిల్లాలో గత నాలుగు రోజుల నుండి చేపడుతున్న ఈ రథయాత్రలో శుక్రవారం రాత్రి బాసరకు చేరుకొని బస చేసి అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వేములవాడ యాద్రాద్రి తరహాలో బాసర అమ్మవారి సన్నిధిని కూడా అభివృద్ధి చేయాలని తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో మొక్కులను తీర్చుకున్నారు. భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన సరస్వతి ఆలయం బాసరలో ఉండగా ఎందుకు రావడం రాలేదని ప్రశ్నించారు. గడ్డెన్నవాగు, పెన్ గంగా ముంపు గ్రామాల భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించి అదే విధంగా సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 3వేల నుండి 5 వేల మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకోగా వాటిపై స్పష్టమైన వైఖరి లేదని విమర్శించారు. కెసిఆర్ కుటుంబ పాలన విడిచి ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల పట్ల, రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించడంలో డబూల్ బెడ్‌రూం, రైతులకు మూడు ఎ కరాల భూమిని కల్పించడంపై దృష్టి సారించాలన్నారు. గతంలో సా యుధ పోరాటాన్ని మెచ్చుకొని ఇప్పుడు నిజాంను పొగుడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 3.50లక్షల అర్హుల కుటుంబాలుంటే కేవలం 4వేల548 మందికి దళిత బస్తీకింద భూములిచ్చారన్నారు. కేజీ టూ పీజీ విద్య ప్రకటనలో మాత్రమే కనిపిస్తుందన్నారు. పీజు రియంబర్స్‌మెంట్, ఉపకారవేతనాలు అందజేయడం లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నార్టీలకు జనభా ప్రకారం నిధులు కేటాయించడం లేదని రిజర్వేషన్లు అంటూ మభ్యపెడుతున్నారన్నారు. ఉమ్మడి జిల్లాలో వైద్య విద్య కోసం ప్రత్యేక నిధులు సమాకుర్చి పాటు పడాలని నియోజకవర్గానికి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేసి మండలానికో కళాశాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్రకార్యదర్శి బాలమల్లేశ్, పద్మ, మాజీ ఎంఎల్‌ఎ గుండా మల్లేష్, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విలాస్, ఎఐటియుసి కార్యదర్శి యూసూఫ్, ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వేణు, మహిళ కార్యదర్శి సృజన, పాండురంగాచారి, రాములు, గిరిజన ప్రధాన కార్యదర్శి రామవత్ అంజయనాయక్, లక్ష్మీనారాయణ, పల్లెనర్సింగ్, శ్రావణి,  తదితరులు ఉన్నారు.

Comments

comments