Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

3 రేట్లు పెరిగిన టాటా మోటార్స్ లాభాలు

tata

* కంపెనీ లాభాలను పెంచిన
జెఎల్‌ఆర్ సేల్స్

ముంబయి: సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రై మాసిక ఫలితాల్లో టాటా మోటార్స్ నికర లాభం మూడు రేట్లు పెరిగింది. జాగ్వార్, ల్యాండ్ రోవర్ వ్యాపారం నుంచి అత్యధిక అమ్మకాలు ఉండడం కంపెనీ త్వరితగతిన విశ్లేషకుల అంచనాలను అ ధిగమించేందుకు కారణమైంది. క్యూ2 (జులై సెప్టెంబర్)లో నికర లాభం రూ. 2,483 కోట్లు నమోదవగా, గత ఏడాది ఇదే సమయంలో లా భం రూ.828 కోట్లుగా ఉంది. కంపెనీ లాభం రూ.1,499 కోట్లుగా విశ్లేషకుల అంచనా వేయ గా, అంతకుమించి లాభాలను ప్రదర్శించింది. వాణిజ్య, ప్రయాణికుల వాహనాల సేల్స్ (ఎగుమ తులతో కలిపి) 1,52,979 యూనిట్లతో 13.8 వృద్ధిని సాధించాయి. మధ్యస్థాయి, భారీ కమర్షి యల్ వాహనాల రంగంలో 28 శాతం, ఐఎల్‌సివి 35 శాతం, చిన్న కమర్షియల్ వాహనాల వ్యా ల్యూమ్స్ 38 శాతం పెరిగినట్టు కంపెనీ వెల్లడిం చింది. కంపెనీ కార్యనిర్వాహక ఆదాయం 10 శా తం పెరిగి రూ.70,156 కోట్లకు చేరింది. లాభం, ఆదాయం మరికొంత అధికంగానే ఉండేదని, అ యితే పౌండ్, రూపాయి మారకం తేడాల కార ణంగా తగ్గాయని కంపెనీ తెలిపింది. కంపెనీ ఫలి తాలు నిపుణుల అంచనాల కన్నా అధికంగా ఉ న్నాయి. సమీక్షా కాలంలో పన్ను వ్యయాలు భారీ గా 152 శాతం పెరిగి రూ.1,070 కోట్లకు చేరా యి. జెఎల్‌ఆర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11.8 శాతం, ఎబిటా 630 కోట్ల పౌండ్ల మేర పెరిగాయి. కార్యనిర్వాహక ఆదాయం 30 శాతం దూసుకుపోయి 13,400 కోట్ల రూపాయలకు పెరిగింది. మార్జిన్ 217 బేసిస్ పాయింట్లు పెరిగి 5.87 శాతానికి చేరింది. తమ టర్న్‌ఎరౌండ్ ప్లాన్ చురుగ్గా ఉందని, ప్రోత్సాహకర ఫలితాలు చూస్తు న్నామని, ఇదే తీరును భవిష్యత్‌లోనూ కొనసాగి స్తామని కంపెనీ ఎండి, సిఇఒ గుయెంటర్ బుట్చె క్ అన్నారు. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌పై కంపెనీ షే ర్లు 0.49 శాతం పెరిగి రూ.440.35కు చేరింది.

Comments

comments