Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

పబ్లిక్ స్కూల్స్‌లో బిసిలకు కోటా కావాలి

hyd

మన దేశంలో 1931 తర్వాత కుల జన గణన జరగలేదు. దేశంలోనే మొట్ట మొదటిసారిగా కుల జన గణనను తెలంగాణ ప్రభుత్వం ‘సకల జనుల సర్వే’ జరిపింది. ఈ సర్వే ప్రకారం బిసిలు యాభై శాతం ఉన్నారు. వీళ్ళ అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో స్కీంలను ప్రవేశపెట్టింది. కానీ, అవి ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. కుల వృత్తులకు సంబంధించిన పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా బిసిలలోని కొన్ని కులాలను ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకు రావాలనుకుంది. ప్రపంచీకరణ తర్వాత వృత్తుల మీద ఆధారపడి జీవించడం కష్టం. బిసిల అభివృద్ధికి ఉన్నత విద్య ఇప్పించడం ఒక మార్గం కాగలదు, అదీ నాణ్యమైన విద్య కావాలి. కొంత మేరకు గురుకులాల ప్రారంభంవల్ల లభిస్తుంది. తెలంగాణలో ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్, ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్, ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వరంగల్ ఈ మొత్తం మూడు స్కూల్స్ ఒకే సొసైటీ క్రింది ఉన్నాయి. ఈ సొసైటీ ‘నో ప్రాఫిట్ నో లాస్’ క్రింద రిజిష్ట్రేన్ అయిన సంస్థ. ఇది నిజాం కాలం నుండి నడుస్తున్నది. ఈ స్కూల్స్‌లో సీటు లభించిన ఎస్.సి., ఎస్.టి పిల్లలకు పూర్తిగా ఉచితంగా విద్యను అందిస్తున్నారు, వీళ్ళ ఫీజులను ప్రభుత్వమే భరిస్తుంది. వీరిలాగే బిసిల పిల్లలకు కూడా ఈ మూడు పబ్లిక్ స్కూల్స్‌లో ఉచిత ప్రవేశాల కొరకు ఒక జిఒను విడుదల చేస్తే బాగుంటుంది. దాదాపు అయిదు వందల సీట్లు ఉన్నాయి. బిసిలకు కూడా జిల్లా బిసి వెల్ఫేర్ ఆఫీసులో దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తే, అక్కడి నుండి వచ్చిన అప్లికేషన్‌లను ఎస్.సి, ఎస్.టిలకు మాదిరిగానే బిసిలకు ప్రత్యేకంగా డ్రా తీసేట్టు ఏర్పాటు చేయాలి. ఇందులో కూడా బిసి అమ్మాయిలకు సగం సీట్లను కేటాయించాలి. బిసిలకు రిజర్వేషన్ ఇవ్వటం వల్ల సంపన్న వర్గాలకు సీట్ల తగ్గవు. ఎందుకంటే వాళ్ళకు ఆధునిక సౌకర్యాలతో కూడిన హైటెక్ స్కూల్స్ చాలానే వున్నాయి కాబట్టి వాళ్ళకు వచ్చిన నష్టం ఏమీలేదు. తెలంగాణ ప్రభుత్వం స్కీంల పేరుమీద వందల కోట్లు ఖర్చు చేస్తుంది. కాని ఆశించిన ప్రయోజనం రావటం లేదు. కాని, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్‌లో బిసిలకు రిజర్వేషన్ కల్పించటం వల్ల రాజకీయంగానూ లాభం కాగలదు. బిసి కమీషన్ చైర్మన్ బిసిలకు రిజర్వేషన్ ఇప్పించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి ప్రయత్నం చేస్తే బాగుటుంది.                                                                                                                                                                                                                                                           పట్నం కమలాకర్, 9963405555

Comments

comments