Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

వేధింపులు తాళలేక భర్తను చంపి కాల్చేసిన భార్యలు

lady

హైదరాబాద్/ జగద్గిరిగుట్ట : నిత్యం మద్యం సేవించి భార్యలతో పాటు పిల్లలను వేధింపులకు గురి చేయడంతో ఆ ఇద్దరు విసుగు చెంది భర్తను అంతమొందించిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాలానగర్ ఎసిపి గోవర్దన్, సిఐ పి.శ్రీనివాస్, ఎస్‌ఐ కె.రవికుమార్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. అస్బెస్టాస్ కాలనీలో గత నాలుగేళ్లుగా నివాసముంటున్న మహేందర్ యాదవ్ (43), పద్మ(35), జ్యోతి(33) దంపతులు. వీరికి ఐదుగురు కుమారులు. మహేందర్ గతంలో చిన్న చిన్న పనులు చేసి వాటిని మానేసి కూలి పనికి వెళ్తూ.. వచ్చిన డబ్బులతో జల్సాలకు అలవాటుపడి మద్యానికి బానిసయ్యాడు. పద్మ, జ్యోతిలిద్దరూ ఓ ప్రైవేటు పరిశ్రమలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నా రు. అయితే గత కొన్ని రోజులుగా మహేందర్ పిల్లలతో పాటు తన ఇద్దరు భార్యలను కూడా మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి మద్యం సేవించి పెద్ద కుమారుడు ఉదయ్‌కిరణ్‌ను దూషించి చెయ్యి చేసుకున్నాడు. దీంతో ఇద్దరు భార్యలు అడ్డుకోవడంతో వారిని కూడా దూషించి చేయి చేసుకున్నాడు. ఓపిక నశించిపోయిన పద్మ, జ్యోతిలు మహేందర్ యాదవ్ నిద్రిస్తుండగా ఆదివారం తెల్లవారు జామున అతడి మెడకు చున్నీతో బిగించి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. అంతేకాకుండా మృత దేహన్ని ఇంటి ఆవరణలో ఉంచి కిరోసిన్, పెట్రోల్ పోసి నిప్పంటించారు. సమాచారం అందుకున్న ఎసిపి, సిఐలు ఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు.  భర్త వేధింపులు తాళలేకనే మహేందర్ యాదవ్‌ను చంపారని పోలీసులు తెలిపారు. అయితే తండ్రి చనిపోవడం, తల్లులు పోలీసులకు లొంగిపోవడంతో పిల్లలతో పాటు మహేందర్‌యాదవ్ తల్లి అనాథలయ్యారు. మృతుడి మేనల్లుడు నరేష్‌యాదవ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించి దర్యాప్తు చేపట్టారు.

Comments

comments