Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

కారు హుషారు

harish

ఉట్నూర్ సభ విజయవంతంతో…
టీఆర్‌ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం

ప్రతిపక్ష పార్టీలన్ని ఏకమై అధికార పార్టీని ఏకాకిని చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తుండగా, అదే రీతిలో సమాధానం చెప్పాలనే సంకల్పంతో ఉట్నూర్ వేదికగా చేపట్టిన చేరికల కార్యక్రమం విజయవం తం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. అధికార టీఆర్‌ఎస్ పార్టీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలకు రాజకీయంగా దడ పుట్టించేందుకు గాను ఈ కార్యక్రమం చేపట్టిందని చెబుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుండి రాజకీయ వాతావరణం మలుపులు తిరుగుతున్న క్రమంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ తన రాజకీయ వ్యూహానికి మరిం త పదును పెట్టేందుకు సిద్ధమయ్యింది. ఇందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీలలోని అసంతృప్త, తటస్థ నాయకులను తమ పార్టీ వైపు ఆ కర్షించేందుకే ఈ ఎత్తుగడ రూపొందించిందని చెబుతున్నారు. ఇం దు లో భాగంగానే అధిష్టానం ఆదేశం మేరకు ఆదిలాబాద్, నిర్మల్, మం చిర్యాల, కుమ్రం భీం జిల్లాల్లో ఇప్పటికే ఆ పార్టీ చాప కింద నీ రులా ఆపరేషన్ ఆకర్ష్‌ను మొదలు పెట్టింది. కింది స్థాయి వరకు ఈ ఆపరేషన్ ఆకర్ష్‌ను తీసుకువెళ్లి ప్రతిపక్ష పార్టీలను గుక్కతిప్పుకోకుండా చేయాలన్నదే టీఆర్‌ఎస్ లక్షంగా  కారులో హుషారు  పెట్టుకుంది. ఇందులోభాగంగానే ఆ పార్టీ ఉమ్మడి జిల్లాలను లక్షంగా చేసుకొని ఆదివారం ఉట్నూర్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాలోని పది సెగ్మెంట్‌ల నుండి టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరాగా, ఖానాపూర్ నియోజకవర్గంతో పాటు ఉట్నూర్ పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది మంది సమావేశానికి తరలివచ్చారు. గత వారం రోజుల నుండి పార్టీలో చేరే వారి కోసం పెద్ద ఎత్తున గాలింపులు జరిపి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావ్ సమక్షంలో పార్టీలో చేర్చుకున్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు జోగురామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ గోడం నగేష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి, ఎమ్మెల్యేలు, గ్రంధాలయ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, టీఆర్‌ఎస్ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు హాజరయ్యారు. ఇదిలాఉంటే ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భారీగా వచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులను మంత్రి హరీష్‌రావ్ ప్రసంగం ఆకట్టుకుంది. జిల్లాలో ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న గిరిజనేతరుల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి శాశ్వత పరిష్కారం చూపించేందుకు కృషి చేస్తాననడంతో ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతరులు హర్షం వ్యక్తం చేశారు.
అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ పాలనలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టుల పనులు, వాటితో జరిగే లాభాలను వివరించడంతో పాటు గత ప్రభుత్వాలు జిల్లాను పట్టించుకోలేదనే అంశాన్ని ఎత్తి చూపించడంంలో సఫలీకృతమయ్యారు. ఇక జన్నారం మండలం పొన్కల్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మించి ఆదుకోవాలని అక్కడి రైతులు ఫ్లెక్సీలు ప్రదర్శించి డిమాండ్ చేయగా, వారి సమస్యను తెలుసుకొని సర్వే చేపట్టి నిధులను విడుదల చేస్తామని హామి ఇవ్వడంతో వారు సైతం ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఇక సమావేశం అనంతరం వివిధ పార్టీలకు చెందిన జిల్లా, మండల స్థాయి నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ పార్టీలో చేరడంతో పార్టీ మరింత బలపడుతుందని అంటున్నారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగా టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన సభ సక్సెస్ కావడంతో ప్రతిపక్షాలు ఖంగుతినక తప్పదని ఆ పార్టీ ముఖ్య నేతలు పేర్కొంటున్నారు.

Comments

comments