Search
Sunday 20 May 2018
  • :
  • :
Latest News

అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

clctr

కురవి: భూ ప్రక్షాళన చేయడంలో అధికారులు చేస్తున్న నిర్లక్షంపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతి మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండలంలోని రాజోలు గ్రామంలో ఏర్పాటు చేసిన భూప్రక్షాళన గ్రామసభలో కలెక్టర్ పాల్గొని రికార్డులను పరిశీలించారు. రైతులు చేసుకున్న ధరఖాస్తులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని, రైతులు చేసుకున్న ధరఖాస్తులను పరిశీలించి క్రమ బద్దీకరణ చేయడంపై జాప్యం తగదని, అధికారుల నిర్లక్షం వదిలి త్వరగా పూర్తి చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు చేసుకున్న ధరఖాస్తులను అధికారులు భూమి వద్దకు వచ్చి నేరుగా సమస్యలను పరిష్కరిస్తారని, రైతులు అధికారులకు సహకరించాలని కోరారు. ఈ గ్రామసభలో స్థానిక తాహసీల్థార్ జన్ను సంజీవ, ఆర్‌ఐ ఫిరోజ్, విఆర్‌ఓ యాకూబ్‌అలి, గ్రామ సర్పంచు దారావత్ రామారావు, వార్డు సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments