Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

ఎండు తెగుళ్లతో కంది రైతు విలవిల

farmer

మన తెలంగాణ/మూసాపేట : అరగాలంలో కష్టించి అప్పులు చేసి ఏదో విధంగా పంటలు పండించి ఒక్క రూపాయి వెనకేద్దామనుకున్న రైతన్నకు ప్రతి పంట లో నష్టం వాటిల్లుతోంది. ఖరీఫ్ వేసిన పంటలకు మొదట్లో వర్షాలు లేక వేసిన పంటలు అరకొర చేతికి అందే సమయంలో పెద్ద ఎత్తున వర్షాలు పడి పంట లు దిగుబడి పూర్తిగా సన్నగిల్లి పోవడంతో వ్యవసా యానికి చేసిన అప్పులు కూడా తీరలేదు. కనీసం రైతన్నలు వేసిన కంది పంట అధిక దిగుబడి వస్తుంద నుకునే సమయంలో ఎండు తెగుళ్లకు గురికావడం తో మండల రైతన్నలు విలవిలలాడుతున్నారు.  ఆ సారి కంది పంట వేపుగా పూత ఏర్పడి కాయ కాసే సమయంలో ఎండు తెగుళ్లు తగిలి మొదటగా పూత రాలి మండల ఎండుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎండు తెగుళ్లకు మందు లేదని వాటి నివారణ కోసం ట్రేకో ధర్మా వీరిడి అనే మందును నీళ్లలో కలిపి కండి చెట్టు కాండం చుట్టూ పిచిరికారి చేసినట్లయితే కొంతలో కొంత లాభం పొందే అవకాశం ఉందని వ్యవసాయాధికారి రాజేందర్‌రెడ్డి రైతులకు సూచించారు. రైతన్నలు కంది పంటుల వేసే ముందు వ్యవసాయాధికారుల సూచనతో ఎండు తెగుళ్లు తట్టుకునే కంది రకాలను సాగు చేయాలని ఎఒ సూచించారు. మండలంలో 1463 ఎకరాల భూమిని కంది సాగు చేశారని ఎండు తెగుళ్లతో ఈ సారి పంట నష్టం బాగా వాటిల్లే ప్రమాదం ఉండడంతో కంది రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

Comments

comments