Search
Tuesday 20 February 2018
  • :
  • :
Latest News

ఉరివేసుకుని రైతు ఆత్మహత్య

body

మనతెలంగాణ/నర్సింహులపేటః మండలంలోని ముంగిమడుగు గ్రామ శివారు బొడ్డితండాకు చెందిన మాలోతు బాష్యా(45) అనే రైతు ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం రాత్రి చొటు చేసుకుంది. పోలిసులు కుటుంబ సభ్యులు చెప్పిన వివిరాలు ఇలా ఉన్నాయి. తనకున్న కోద్ధిపాటి పోలంలో జీవనోపాధి పోందలేక తనకు మూగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుతూరు వివాహం జరిగింది రెండవ కుతూరికి వివాహం కుదుర్చుకోన్నారు. ఈ క్రమంలో తన వద్ద డభ్బులు లెవని తరుచు ఇంట్లో బాదపడుచుండెవాడు వడ్డిలకు అప్పులు ఎక్కడి నుండి తెవలో ఆర్థంకాక కుటుంబ సభ్యులు నిద్రించువేల మనోవెదనకు గురై రాత్రివేల ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఉదయం లేచి చూసేసరికి ఉరి వేసుకుని కనిపించడంతో పోలిసులకు సమాచరం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న ఎస్‌ఐ సిహెచ్ నగేష్ అతని ఆత్మహత్యకుగల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుడిని శవ పరీక్షల కొసం మహబూబాబాద్ ఏరియా ఆస్పీటల్ తరలించి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలిసులు తెలిపారు.

Comments

comments