Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

దేశ భవిష్యత్తు పిల్లలపైనే ఆధారపడి ఉంది

school

*సర్కారు బడి విద్యార్థులకు ప్రయోగాత్మకమైన మెరుగైన విద్య
*ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతుల అందజేత
*బాలల దినోత్సవంలో జిల్లా కలెక్టర్ భారతిహోళికేరి

మనతెలంగాణ/మెదక్ ప్రతినిధి : నేటి బాలలే రేపటి పౌరులు అని, దేశ భవిష్యత్తు పిల్లలపైనే ఆధారపడి ఉందని, అందుకోసం చిన్నతనం నుండే పిల్లలు సన్మార్గంలో నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ భారతిహోళికేరి అన్నారు. మంగళవారం నాడు జిల్లా కలెక్టరేటు బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ భారతిహోళికేరి మాట్లాడుతూ… ప్రపంచ బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న జరుపుకుంటారని, కానీ మన దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని 1964 నుండి నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి దేశ భవిష్యత్తు బాలల మీదనే ఆధారపడి ఉందన్నారు. చిన్నప్పటి నుండి మంచి మార్గంలో పయనించి దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. పిల్లల కోసం ఎన్నో హక్కులు ఉన్నాయని, హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే లిటిల్ లీడర్, -లిటిల్ టీచర్, అంకుర బోధన, నయనజ్యోతి, రక్త పరీక్షలు వంటి కార్యక్రమాలను ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తునట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకొని భవిష్యత్తులో దేశాభివృద్ధి కోసం పాటుపడాలని సూచించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిడబ్లువో జ్యోతిపద్మ, డిపివో హనోక్, డిఎం అండ్ హెచ్‌వో వెంకటేశ్వరరావు, డిపిఆర్‌వో జయరాజు, డిఐవో యేసయ్యతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments