Search
Saturday 25 November 2017
  • :
  • :
Latest News

క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు

cricket

ఏసీఎల్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన మంత్రి రామన్న 

మన తెలంగాణ / ఆదిలాబాద్ టౌన్ : రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నామని, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన 6వ అంతర్రాష్ట్ర ఆదిలాబాద్ క్రికెట్ లీగ్ పోటీలను ఆయన బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. మండలానికో మినీస్టేడియం నిర్మాణాలకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. ఆదిలాబాద్ ఎంపి నగేష్ మాట్లాడుతూ సచిన్ టెండూల్కర్‌ను ఆదర్శంగా తీసుకుని క్రీడాకారులు ముందుకు సాగాలన్నారు. ప్రతి రోజు సాధన చేస్తూ క్రమశిక్షణతో పోటీల్లో పాల్గొంటే మంచి క్రీడాకారులుగా ఎదగవచ్చన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈకార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ చైర్మన్ లోక భూమారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు రంగినేని పవన్ రావ్, కౌన్సిలర్ సత్యనారాయణ, బండారి సతీష్, కలాల శ్రీనివాస్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు సాజిదొద్దిన్, నైతం శుక్లాల్, బేల సర్పంచ్ మస్కే తేజ్ రావ్, క్రికెట్ పోటీల నిర్వాహకులు మోసిన్, అస్లం, నితిన్, షకీల్ పాల్గొన్నారు.

Comments

comments