Search
Monday 11 December 2017
  • :
  • :

రైతుల అభివృద్ధే ధ్యేయం

grand

రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

మన తెలంగాణ/నిర్మల్‌టౌన్ : రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినట్లు  రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి  అన్నారు. ఆదివారం పట్టణంలో గల వైఎస్‌ఆర్ ఫంక్షన్‌హాల్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు ఫ్యాకేజ్ 27కు చెందిన భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి పాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణలతో చెరువులల్లో పుష్కలంగా నీరు నింపి వ్యవసాయానికి సమృద్ధ్దిగా నీరందించడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. కాళేశ్వరం 27వ ప్యాకేజ్ ద్వారా నిర్మల్ జిల్లాలోని 50వేల ఎకరాలకు నీరందజేయాడానికి పనులు చేపట్టడం జరిగిందన్నారు.ఈ ఫ్యాకేజ్ ద్వారా స్వర్ణ,గడ్డన్న వాగు చెరువులు నింపడంతో పాటు వ్యవసాయానికి సమృద్ధిగా నీరందుతుందన్నారు. మిషన్ కాకతీయ ఫేజ్ 1.2.3 క్రింద చెరువులు అభివృద్ది పరుచడం జరిగిందని ఫేజ్ 4 క్రింద జిల్లాలో 40 చెరువులకు మరమ్మత్తుల పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.అలాగే రైతులకు 24గం॥ల నిరంతర విద్యుత్‌ను అందిచడానికి పనులు జరుగుతున్నాయన్నారు.అలాగే రైతులకు సాగు కు పెట్టుబడి క్రింద ఎకరానికి రూ.4 వేలు వచ్చే జూన్ నుండి ఇవ్వన్నుదన్నారు.ఈ సందర్భంగా 27వ ఫ్యాకేజ్ క్రంద భూమి కొల్పోయిన రైతులకు 102 మందికి రూ.3కోట్ల 70 లక్షల 58 వేలు విలువగల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు దేవేందర్‌రెడ్డి, రాజ్‌మహ్మద్, ఆర్‌డిఒ ప్రసునాంబ, విజసత్యనారాయణగౌడ్, రామరావు, వెంకటరమణరెడ్డి, జీవన్‌రావు, రాజేశ్వర్, తహాసీల్థార్లు, రైతులు పాల్గొన్నారు.

Comments

comments