Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ లక్షం

talk

ఎంఎల్ఎ ఏనుగు రవీందర్ రెడ్డి

మనతెలంగాణ/ఎల్లారెడ్డి: ప్రజాశ్రేయస్సే తమ ప్రభుత్వ లక్షమని, బడుగు బలహీన వర్గాలు, రైతుల కోసం  ఎన్నో పథకాలు రూపొందించి అమలు చేస్తున్న ఘనత తమదేనని ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నారు. తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఆదివారం ఆయన షాదీ ముబారక్,  సిఎం రిలీఫ్ ఫండ్  చెక్కులను  లబ్ద్ధిదారులకు  పంపిణీ చేసారు. ఈ సందర్భంగా  ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. రైతులకు నాణ్యమైన కరెంట్‌ను అందించిన ఘనత తమదేనని, రాబోయే రోజుల్లో 24 గంటల నిరంతర కరెంట్‌ను సరఫరా చేసేందుకు సిఎం ప్రణాళిక రూపొందించారని అన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌లో ఎకరాకు నాలుగు వేల రూపాయల నగదును రైతుల ఖాతాలలో జమచేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గొల్ల కుర్మ కులస్తులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్షంతో సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తున్నట్లు  చెప్పా రు. ఆడపిల్లల వివాహాలు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశ్యంతో  సిఎం షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మీ పథకాలను రూపొందించారని ఆయన అన్నారు. అన్ని రంగాలలో రాష్టాన్ని అభివృద్ధి చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. రైతుల శ్రేయస్సే తమ లక్షమని, రైతుల ప్రయోజనాల కోసం మిషన్ కాకతీయ  ప్రవేశపెట్టామన్నారు. మిషన్ కాకతీయ వల్ల లక్షలాది ఎకరాల భూములకు సాగునీరు అందిందని చెరువులు నీటితో కళకళలాడుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో  ఆర్డీ ఓ దేవేందర్‌రెడ్డి, తహసీల్దార్ అంజయ్య,  ఎఎంసి చైర్మన్ మారెడ్డి వెంకట్‌రాంరెడ్డి, నాయకులు, నక్కగంగాధర్, సామెల్ శ్రీనివాస్, విద్యాసాగర్, శ్రీనివాస్‌రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.

Comments

comments