Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

harish2*ప్రజా అవసరాలపై ప్రత్యేక చొరవ
*55 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు
*భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/కొండాపూర్: రైతుల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, గత ఉమ్మడి రాష్ట్రంలో పగలు విద్యుత్ సరఫరా లేక వ్యవసాయ పనులకు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొన్నారని భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని తొగర్‌పల్లి గ్రామంలో రూ.కోటి 62 లక్షలతో 33/11కెవి విద్యుత్ సబ్‌స్టేషన్ పనులను మంత్రులు హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం కరెంటు కష్టాలు వర్ణనాతీతమని, తాగునీరు దొరకక పోయేదన్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదని, గ్రామంలో ఏవరైనా మరణిస్తే కరెంటు అధికారులను బ్రతిమిలాడి 10 నిమిషాలు కరెంటును అడిగేవారన్నారు. తెలంగాణ రాష్ట్రం అనంతరం వెంటనే నిరంతర విద్యుత్‌ను అందించిందన్నారు. అంతేకాక వ్యవసాయ రంగానికి నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతుల పంట గిట్టుబాటు ధరకు గత సంవత్సరం వేయికోట్లతో కంది కోనుగోళ్లు, 8వేల కోట్లతో 55లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోళ్లు చేసినట్లు వెల్లడించారు.  నిరుపేద ఆడపిల్లల సంక్షేమం కొరకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను అమలు చేసి ఆడపిల్లల పెళ్లిఖర్చుల గాను రూ.50వేలు ఇచ్చిన అనంతరం రూ.75,116 పెంచి మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేశామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికి 523 ఇంగ్లీష్ రెసిడెన్షియల్‌లు, మిషన్ కాకతీయ, మిషన్‌భగీరథతో పథకాలతో సిఎం కెసిఆర్ తెలంగాణ ప్రజల అభివృద్ధికి కృషి చేస్తూ, బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తున్నారన్నారు. రైతుల సంక్షేమం కోసమే వచ్చే ఏడాది నుండి రైతు పంట పెట్టుబడుల నిమిత్తం ప్రభుత్వం ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకు రెండు దఫాలుగా 8వేలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రామాభివృద్ధిపై సిసి రోడ్డు, కల్వర్టుల నిమి త్తం రూ.20లక్షలు మంజూరు చేస్తున్నట్లు  మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఎమ్మెల్యే చింతాప్రభాకర్ మాట్లాడుతూ కొండాపూర్ మండల అభివృద్ధికి మూడు సంవత్సరాలకు గానూ ఇప్పటి వరకు రూ.128 కోట్లు వెచ్చించినట్లు, తొగర్ గ్రామానికి 9 కోట్ల 22లక్షల రూపాయలను ఖర్చుచేసినట్లు వెల్లడించారు. కులమతాలకు అతీతంగా కులవృత్తులను చేయూతనిచ్చిన ప్రభుత్వం టిఆర్‌ఎస్ అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపి కొత్తప్రభాకర్‌రెడ్డి, జెసి వాసం వెంకటేశ్వర్లు, ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, సిడిసి చైర్మన్ విజయేందర్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ నరహరిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు రాధాబాయి, మల్లాగౌడ్, కొండల్‌రెడ్డి, ఎంపిపి విఠల్, మహిళాశిశు సంక్షేమ శాఖ కోఆర్డినేటర్ లక్ష్మి, జిల్లా అర్డీఎ సభ్యులు యాదగిరిగౌడ్, సర్పంచ్ మంజులప్రభాకర్, ఎంపిటిసి కౌలస్యజలేందర్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, డా.శ్రీహరి, విద్యుత్ శాఖ సిజిఎం సదాశివరెడ్డి, ఎఇ అశోక్, కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.

Comments

comments