Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

టీచర్‌ను కొట్టి చంపారు

dead

లైంగిక వేధింపుల ఫిర్యాదు వెనక్కి తీసుకోనందుకు ఓ క్రైస్తవ ఫాదర్ అనుయాయుల గూండాగిరీ

కామారెడ్డి/హైదరాబాద్: వేధింపుల ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలంటూ కొంత మంది వ్యక్తులు ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కొట్టి చంపారు. కామారెడ్డి పట్టణంలో సంచలనం సృ ష్టించిన ఈ ఘటన శుక్రవారం జరిగింది. స్థానిక అశోక్‌నగర్‌లో నివసించే దైవ సహాయం బిక్నూర్ మండల కేంద్రంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఈయన భార్య మమత కూడా బిక్నూర్‌లోనే నర్సుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి సమీ ప బంధువు కామారెడ్డి పట్టణంలో సిఎస్‌ఐ చర్చి ఫాదర్ విల్సన్ కొంత కాలంగా మమతను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ విషయంలో ఎన్ని పర్యాయాలు హెచ్చరించినా వినక పోవడం తో దైవసహాయం ఈనెల 4వ తేదీన కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును వెన క్కి తీసుకోవాలంటూ కొంత కాలంగా ఆయనపై ఒత్తిళ్ళు వస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం కొంతమంది ఇంటికి వచ్చి ఒత్తిడి పెంచారు. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గక పోవడంతో విల్సన్ అనుచరులంటూ వచ్చిన వారు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వెంటనే భార్య మమత ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఘటన గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగి హత్యకు కారకులైన కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండ గా, తన భర్త మృతికి పోలీసులే ప్రధాన కారణమ ని భార్య మమత ఆరోపించారు. ఫాదర్ తన పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్న విషయాన్ని 4 వ తేదీన ఫిర్యాదు చేస్తే విచారణ పేరుతో కాలయాపన చేశారని, దీంతో ఫాదర్ తన అనుచరులతో తమను వేధింపులకు గురి చేయడంతో పాటు తన భర్తపై దాడి చేసి హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భర్త మృతికి కారకులైన పోలీసులపైనా, ఫాదర్, అతడి అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని మమత డిమాండ్ చేశారు. మరో పక్క ఫాదర్ అక్రమాలపై విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు లోతుగా విచారణ జరిపి సిఎస్‌ఐ చర్చి ఆస్తులు, అక్రమాలపై కూడా విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Comments

comments