Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్షం

trs

*ఎంఎల్‌ఏ గాదరి కిషోర్‌కుమార్
మనతెలంగాణ/నాగారం : వర్గాల ప్రజల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్షమని తుంగతుర్తి ఎంఎల్‌ఏ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. ఆదివారం నాగారం మండల పరిదిలోని ఫణిగిరి గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఎంఎల్‌ఏ సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఏ వారికి పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. అంతకముందు ఎంఎల్‌ఏ గాదరి కిషోర్‌ను కోలాటల పదర్శన, నృత్యలతో ఆహ్వనించారు. అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలోకి భారీగా చేరుతున్నారు అన్నా రు. ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సిఎం కేసిఆ ర్‌కే దక్కిందన్నారు. 70 సంవత్సరాలలో ఏనాడు జరగని అభివృద్ధి మూడున్నర సంవత్సరాలల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిందన్నారు. ఎన్నికల మ్యానిఫెస్ట్‌లో ఇచ్చిన హమీలను నిలబెట్టుకున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభు త్వమన్నారు. ఆసరా పింఛన్‌లు, మిషన్ భగిరథ, మిషన్ కాకతీయ ఆడపిల్లల సంక్షేమం కోసం కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలను ప్రవేశపెట్టి మహిళ, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నా ప్రభుత్వమని పేర్కొన్నారు. అదేవిధంగా ఎస్సా రేప్సి కాలువ మరమతులతో తుంగతుర్తి నియోజకవర్గంలో లక్ష ఎకరాల వరకు నీరు అంది నియోజకవర్గం సస్య శామలం అవుతుందన్నారు. మహిళా సంక్షే మం కోసం షీ టీమ్‌లు, 506గురుకుల పాఠశాలలు, 30కళాశాలలను మహి ళల కోసమే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా కేసిఆర్ కిట్టు ఆడపిల్లలు పుడితే 13వేలు, మగ బిడ్డ పుడితే 12వేలు విడుతల విడు తలుగా మహిళలకు అందిచనున్నట్లు తెలిపారు. త్రాగు నీరు విషయంలో ప్రభుత్వం మిషన్ భగీరథ పథకంలో కోటి 25లక్షల రూపాయలతో ఫణిగిరి గ్రామంలో నాలుగు ట్యాంకుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అలాగే రైతుల సంక్షేమం కోసం భూ రికార్డుల శుద్ధీకరణ, 24గంటల విద్యుత్, 2018మే తర్వాత ఎకరా నికి 8వేల రూపాయాలను రెండు పంటలకు ఇవ్వనున్నట్లు ఇలాంటి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌కే దక్కిందన్నారు. నియోజకవర్గంలో రూ.21కోట్ల 90లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఫణిగిరి నాగారం బిటి నిర్మాణం కోసం 2కోట్ల వ్యయంతో ప్రతిపధనలు పంపినట్లు తెలిపారు. ఎస్సీ కమ్యూనిటి హల్ నిర్మాణం కోసం ఏడున్నర లక్షల రూపాయాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంద ర్భంగా సుమారు 500మంది వివిధ పార్టీ నాయకులు కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో కండువా కప్పి ఆహ్వనించారు. ఈకార్యక్రమంలో తిరుమలగిరి మార్కె ట్ కమిటి చైర్మన్ పాశం విజయ, మండల అధ్యక్షుడు గుండగాని అంబయ్య, తిరుమలగిరి ఎంపిపి కొమ్మినేని సతీష్, సర్పంచ్ కలెట్లపల్లి ఎల్లమ్మ, ఉప్పలయ్య, జెడ్‌పిటిసి పెరాల పుల్లమ్మ, పిఎసిఎసి చైర్మన్ గుంతకడ్ల అశోక్‌రెడ్డి, రైతు సమన్వయ మండల కోఆర్టినేటర్ పానుగంటి నర్సింహ్మరెడ్డి, టీఆర్‌ఎస్‌వీ జిల్లా కో ఆర్టినేటర్ కలెట్లపల్లి శోభన్‌బాబు, దేవాలయ చైర్మన్ దేవిడి సుభాష్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు ముదికొండ శేఖర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు పాశం యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పార్టీలో చేరిన వారిలో….
నాగారం మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన వారిలో భట్టు వెంకట్ నారాయణ, సుధాకర్, సొమిరెడ్డి, ఎర్ర రామనర్సయ్య, మేకల సుజాత, లక్కవత్ రవి, లక్కవత్ సత్రు, బానోతు రెడ్డి నాయక్, పొదిల మూతిలింగయ్య, పంజాల వెంకట్‌నారాయణ, సయ్యద్, ఎస్‌కే. ఖారీమ్, హుసేన్, పొదిల లింగయ్య, ఎస్‌కే. బాడేసాబ్, పొదిల ఎశోక్, పొదిల వీరయ్య వివిధ గ్రామాలకు చెందిన 500మంది నాయకులు పార్టీలో చేరారు.

Comments

comments