Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

అటవీ భూముల హక్కులపై ఎడతెగని కిరికిరి

COW

పెండింగ్‌లో వందల దరఖాస్తులు

సర్కారు కరుణ కోసం ఎదురుచూస్తున్న అడవి బిడ్డలు

దట్టమైన అడవుల్లో సర్కారి ఆలనపాలనకు దూరమై అక్కడి పనికిరాని పోడు భూములను సేద్యం చేస్తూ క డుపు నింపుకుంటున్న గిరిపుత్రులను దశాబ్దాల నుంచి పాలకులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. సాగునీరు, రోడ్డు, వైద్యం లాంటి కనీస సౌకర్యాలకు నో చుకోని ఈ అడవి బిడ్డల గోడు ఏళ్ల నుంచి అరణ్య రోదనగానే మారుతుంది. ఏళ్ల నుంచి నమ్ముకొని తమ పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్న గిరిజనులు ఆ భూములపై హక్కులను మాత్రం పొందలేక పోతున్నారు. అ వన్ని అటవీ భూములుగానే కొనసాగుతుండడంతో ఆ భూములపై హక్కులు దక్కడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి కొం త మంది గిరిజనులకు ఈ అటవీ భూములపై హక్కులను కల్పించడమే కాకుండా పట్టాలు జారీ చేశారు. అయితే అప్పట్లో కొంత మంది పలుకుబడి, పరపతి కలిగిన వ్యక్తులు మాత్రమే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగారు. కాగా వందల మంది గిరిజనులు స మాచార లోపం, అవగాహన రాహిత్యం, అమాయక త్వం కారణంగా తాము సాగు చేస్తున్న భూములపై హ క్కు కోసం ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను పెండింగ్‌లో పెడుతూ వచ్చాయి.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత మళ్లీ ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఆంధ్ర పాలకుల కాలంలో వివక్షానికి గురైన తాము స్వరాష్ట్రంలోనైనా న్యాయం దక్కించుకుంటామని ఆశిస్తూ వచ్చారు. మళ్లీ తాము సాగు చేసుకుంటున్న అటవీ శాఖ ఆధీనంలోని పోడు భూములపై హక్కులను కల్పించాలని గిరిజనులు డిమాండ్ లేవనెత్తారు. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు జరిపినప్పటికీ దరఖాస్తుల సంఖ్యను చూసి వెనకడుగు వేస్తుంది. ప్రభుత్వం గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నామంటూ ఓ వైపు ప్రకటన జారీ చేస్తూనే ఈ వ్యవహారంపై నిరాశక్తత కనబర్చుతున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు గిరిజనులకు అటవీ భూముల హక్కులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అటవీ భూముల ఆక్రమణ యధేచ్చగా కొనసాగుతుందంటూ ఆ భూములపై హక్కులు కల్పిస్తే ఉమ్మడి జిల్లాలోని అడవులు ఎడారులుగా మారే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. అటవీ శాఖ అభ్యంతరాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై పునరాలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో లంబాడా, ఆదివాసీల మధ్య వివాదం కొనసాగుతున్న క్రమంలో అటవీ భూములపై హక్కు కల్పిస్తే సరికొత్త వివాదం చెలరేగే అవకాశాలు లేకపోలేదంటున్నారు. వేలాది ఎకరాల అటవీ భూములపై హక్కులను కల్పిస్తే జరిగే పరిణామాలపై ప్రభుత్వం, అటవీశాఖ దృష్టి సారిస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న అటవీ భూములపై హక్కులను కల్పిస్తే తాము ఆర్థికంగా ఎదిగే అవకాశాలున్నాయని గిరిజనులు అంటుండగా, ప్రభుత్వం మాత్రం ఈ వ్యవహారంపై ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుందని అంటున్నారు. ఇదిలాఉంటే అడవి బిడ్డలు మాత్రం సర్కార్ ఎప్పటికైనా తాము సాగు చేస్తున్న అటవీ భూములపై హక్కులను కల్పిస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు.

Comments

comments