Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

ఆసుపత్రి వాతావరణం రోగికి అనుకూలంగా ఉండాలి

asifa

ఆసిఫాబాద్ కలెక్టర్ చంపాలాల్

ఆసిఫాబాద్ రూరల్ :  ఆసుపత్రికి వచ్చే రోగులు ఆసుపత్రి వాతావరణం చూడగానే రోగి యొక్క సగం రోగం తగ్గాలని జిల్లా పాలనాధికారి చంపాలాల్ అన్నారు. బుధవారం నాడు జిల్లా సమావేశ మందిరంలో నేషనల్ క్వాలిటీ ఎస్యూరెన్స్(జాతీయ నాణ్యతా ప్రమాణాల కార్యక్రమం)జరిగిం ది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా పాలనాధికారి యం.చంపాలాల్ మాట్లాడుతూ పి.హెచ్.సి.లో, సి.హెచ్.సిలో పేషెంట్ పరంగా స్టాఫ్ పనిచేయడానికి ఎ లాంటి వసతులు ఉండాలి, వారు పనిచేసిన దానికి కొలతలు తీసుకుని దాని ద్వా రా మానిటర్ చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ నాణ్యతా ప్రమాణాల కార్యక్రమం ద్వారా చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 22 పి.హెచ్.సిలు, 2సి.హెచ్.సిలను జాతీయ గుర్తింపు  కోసం పనిచేయటం జరుగుతుందని అన్నారు. జిల్లాలో వైద్య సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. జిల్లాలో గల వైద్య సిబ్బంది యొక్క లోపాలు ఏమేమి ఉన్నాయో అవి సరిదిద్దుకుని వచ్చే నెల డిసెంబర్ 2వ వారంలో మరోసారి రివ్యూ చేయమని జిల్లా వైద్యాధికారిని కలెక్టర్ ఆదేశించారు. వచ్చినటువంటి ఫలితాలను డిసెంబర్ 3,4వ వారంలో మరోసారి సమీక్ష నిర్వహించాలన్నారు.
ముఖ్యంగా మరుగుదొడ్లు మరియు రోగులు ఉండే బెడ్స్,గది శుభ్రంగా ఉంచాలన్నారు.వైద్య సిబ్బంది అందరూ చెక్ లిస్టును తయారు చేసుకుని దాని ప్రకారం విధులు నిర్వహించాలని ఆదేశించారు.ఆనంతరం జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు మాట్లాడుతూ భారత దేశంలో కుష్ఠు వ్యాధి ఎక్కడైతే ఎక్కువగా ఉందో కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం చేపట్టాలని తెలిపారు.ఈ వ్యాధి కుమ్రంభీం జిల్లాలో 106కేసులు గుర్తించామని అన్నారు. అంగన్‌వాడి,ఆశవర్కర్లు ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.ఈ వ్యాధి ఉన్న రోగులకు బహుళ ఔషద చికిత్సతో ఉచితంగా మందులు ఇచ్చి రోగాన్ని నయం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాణ్యత ప్రమాణాల అధికారి నల్లమోతు రాజేష్, జిల్లా నాణ్యత ప్రమాణాల అధికారి ధరమ్ సింగ్, వైద్యాధికారులు, పారామెడికల్ అధికారులతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments