Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

15 నాటికి పంట నష్టంపై ఇన్సూరెన్స్ చేయించాలి : కలెక్టర్

talk

మన తెలంగాణ/కామారెడ్డి: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధాన మంత్రి ఫసల్ బీ మా  యోజనను గ్రామం మండలం ఒక యూనిట్‌గా రైతులకు పంట నష్టంపై ఇన్సూరెన్స్ చెల్లించుటకు ప్రీమియంను రైతుల నుండి వ్యవసాయ విస్తీర్ణాధికారి ప్రాథమిక వ్యవసాయ సంఘం పి ఎసీ రైతు సమన్వయ సమితులు డిసెంబర్ 15 నాటికి కట్టే విధంగా చర్యలు తీసుకోవాలని రుణగ్రహీత రుణం పొందని రైతులు రెన్యూవల్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. మంగళవారం జిల్లా ఉద్యాన వన శాఖ ఆధ్వర్యం లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన బ్యాంకు అధికారులతో మాట్లాడారు. రైతులు పం డించిన పంట 14 రోజుల్లో నష్టం వాటిల్లినచో  పంట పండిన అనంతరం 48 గంటల్లో ఇన్సూరె న్స్ అధికారులకు సంబంధిత శాఖల ద్వారా స మాచారం అందించాలని తద్వారా క్షేత్రస్థాయి ప ర్యటన జరిపి పంట నష్టం ధృవీకరించి రైతులకు సత్వరమే అందించబడుతుందన్నారు. రైతులకు ప్రీమియం కట్టించడంలో ఆంధ్రా, డిసిసిబి, ఎన్‌జి బి బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీ రైతుల నుండి వసూ లు చేయరాదన్నారు. వరి ప్రీమియం గతంలో 420 ఉండగా ఇప్పుడు 412,జొన్న 160,మొక్కజొన్న 375 ప్రీమియంగా రైతులు చెల్లించాలన్నా రు. ఖరీఫ్ కాలానికి గాను పంట నష్టానికి జిల్లాకు 18 కోట్ల 73 లక్షలు విడుదల అయ్యాయని వాటి ని రైతుల ఖాతాల్లో జమ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని ,ఇన్ ఫు ట్ సబ్సిడీ ద్వారా 7కోట్ల 15లక్షలు విడుదల అయ్యాయని వీటిని రై తుల ఖాతాలో జమచేసే విధంగా వ్యవసాయ విస్తీర్ణాధికారులు ,ఫీల్డసిస్టెంట్లు, రైతు సమన్వయ సమితి లు చర్యలు తీసుకోవాలన్నారు. ఉ ద్యాన వన శా ఖ ద్వారా మామిడి పంట  నష్టానికి ప్రీమియం 1250 చెల్లించే విధంగా ఉద్యాన వన శాఖ అధికారి చర్యలు తీసుకోవాలన్నా రు. రైతులు తాము పొందిన బ్యాంకు రుణాలను వెంటనే చెల్లించినచో ప్రీమియం రేనువల్ చేయబడుతుందన్నారు. జిల్లాలో రైతుల నుండి వరి 1లక్ష 57 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినందుకు 205 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉండగా 150 కోట్లు మాత్రమే వేయబడిందని, 100 కోట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే రైతులకు పంట రెన్యూవల్‌కు సులభంగా ఉంటుందని కలెక్టర్ తెలిపా రు. రైతుల భూముల వివరాలను ఎల్లార్ యుపి ద్వారా 473రెవె న్యూ విలేజ్‌లకు 300 గ్రామాల్లోని 2లక్షల 50వేల ఎకరాలను ఆన్‌లైన్ అప్లోడ్ చేయడమైందని దీనిని త్వరలో అందిస్తామన్నారు. రైతులలో ఎస్సీ, ఎస్టీ, బిసిలకు వేరు వేరుగా ప్రీమియం ఉంటుందని దీని పై అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో రీజినల్ మేనేజర్ శివప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి నాగేంద్రయ్య, జిల్లా కోఆపరేటివ్ ఉద్యాన వన శాఖ.

Comments

comments