Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

మెరుగైన వైద్యం అందించడమే కెసిఆర్ లక్షం: మంత్రి లక్ష్మారెడ్డి

minister2నిజామాబాద్‌రూరల్: పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికే, మిగతా రంగాలతో పాటు వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రులను సైతం ఆధునీకరించి మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మాధవనగర్‌లోని ఇందూర్  క్యాన్సర్ ఆసుపత్రిలో రేడియోథెరపిబ్లాక్, లినియర్ ఎక్లిరెటర్ బ్లాక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునాతనమైన పరికరాలను సైతం ఏర్పాటు చేస్తుందని ప్రతి జిల్లా కేంద్రంలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయడం, గర్బిణీ స్త్రీలకు కేసిఆర్ కిట్స్ అందజేయడం ద్వారా ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెరిగేలా చర్యలు తీసుకున్నామని మంత్రి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సైతం తగిన చర్యలు తీసుకుంటుందని కావాల్సిన మందులను అందుబాటులో ఉంచడం ద్వారా ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా చేయగలుగుతున్నామని చెప్పారు. ఇందూర్ క్యాన్సర్ హస్పిటల్ వారు ఆధునీక పరికరాలను ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం ద్వారా హైదరాబాద్ వరకు వచ్చే అవకాశం లేకుండా చేశారని వారిని ప్రశంసించారు. ఇందూర్ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా క్యాన్సర్ వచ్చిన వారికి 3 నెలల పాటు ఇంటి వద్దే ఆరోగ్య సేవలు అందించేలా కృషి చేస్తున్నామని డాక్టర్ ప్రశాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో  రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నగర మేయర్ ఆకుల సుజాత, శాసన మండలి సభ్యులు డి. రాజేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments