Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

గత పాలకుల వల్లే వెనుకబడ్డ తెలంగాణ

mam

నేడు అన్ని రాష్ట్రాల కంటే
ముందు వరుసలో రాష్ట్రం
అభివృద్ధి పథంలో
ముందుకు తీసుకెళ్తున్న కెసిఆర్
రానున్న ఆరునెలల్లో ప్రతి ఇంటికి
స్వచ్ఛమైన తాగునీరు
స్పీకర్ మధుసూదనాచారి

మనతెలంగాణ/శాయంపేట: 70 ఏళ్లలో చేయని అభివృద్ధి మూడేళ్లలో చేశానని, అభివృద్ధి చేయలేద ని నిరూపిస్తే క్షమాపణ చెపుతానని స్పీకర్ సిరికొం డ మధుసూదనచారి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపిడిఒ కార్యాలయంలో సర్వసభ్య సమావేశానికి ఎంపిపి బాసని రమాదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్పీకర్ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. శాయంపేట మండలా న్ని భూపాలపల్లి జిల్లాలో కలపాలని వివిధ గ్రామాల ఎంపిటిసిలు ఏకగ్రీవంగా తీర్మాణించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ తెలంగాణ నీళ్లు, నిధుల నియామకాల కోసం సాధించుకున్నామని, ఈ మూడేళ్లలో కొంత వరకు సాధించుకుంటున్నామని తెలిపారు. గత పాలకుల కారణంగా తెలంగాణ ప్రజలు అన్నిరకాలు గా వెనుకబడిపోయారని, తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రాష్ట్రాల కంటే ముందు వరుసలో ఉందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్నారన్నారు. రానున్న ఆరునెలల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు, మిషన్ భగీరథ ద్వారా అందిస్తామని, రైతులకు 24 గంటల కరెం ట్ ఇచ్చేందుకు కృషి చేస్తాననన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మరమ్మతుల కోసం రూ.వేయి కోట్లు మంజూరుచేస్తే కేవలం భూపాలపల్లి నియోజకవర్గం లో రూ.100కోట్లు కేటాయించినట్లు తెలిపారు. శాయంపేలో రోడ్డవెడల్పులో ఇండ్లు కోల్పోయిన 52 కుటుంబాలకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు కట్టించి ఇస్తానని హామీనిచ్చారు. శాయంపేట మండల అభివృద్ధి కోసం తనవంతు కృషి ఉంటుందన్నారు. తహసీల్దార్ వెంకటభాస్కర్, ఎంపిడిఒ రమాదేవి, వైఎస్ ఎంపిపి జయపాల్‌రెడ్డి, వివిధ గ్రామాల ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

comments