Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

లభ్యం కాని గల్లంతైన అమ్మాయిల ఆచూకీ

search

మనతెలంగాణ/చిలప్‌చెడ్: మంజీరానదిలో గల్లంతైన ఇద్దరు అమ్మాయిల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు నర్సాపూర్ సిఐ తిరుపతిరాజు తెలిపారు. మండల పరిధిలోని శ్రీ చాముండేశ్వరిమాత దేవాలయానికి హైదరాబాద్ నగరానికి చెందిన మల్కాజిగిరి నుండి వచ్చిన శ్రీవిద్య, రోహిత అనే ఇద్దరు అమ్మయిలు ఆదివారం నాడు ప్రమాదవశాత్తు జారీ నదిలో గల్లంతైన విషయం తెలిసినదే. వారి కోసం పోలీసు, రెవెన్యూ శాఖల ఆధ్వ ర్యంలో సోమవారం గాలింపు చర్యలు చేపట్టారు. నర్సాపూర్ సిఐ తిరుపతిరాజు తెలిపిన వివరాల ప్రకారం చిలప్ చెడ్ ఎస్‌ఐ, నర్సాపూర్ ఎస్‌ఐలు, ఇద్దరు ఎఎస్‌ఐల ఆధ్వర్యంలో సమీప మత్సకారులు, గజ ఈతగాళ్లతో రెండు మార్గాలుగా ఏర్పడి సోమవారం ఉదయం నుండి సుమారు 10 కిలోమీటర్ల మేర గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎంతగా వెతికినప్పటికీ గల్లంతైన వారి ఆచూకీ లభించలేదన్నారు. ఈ గాలింపు చర్యల్లో ఎస్‌ఐలు మల్లయ్య, రాజయ్య, తహసీల్దార్ సాదత్, మత్సశాఖ ఎడి లక్ష్మినారాయణ, ఎఫ్‌డిఓ నర్సింహారావు, ఎఎస్సైలు వెంకటేశం, ఖలీమోద్దిన్, విఆర్‌ఓలు తదితరులున్నారు.

Comments

comments