Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

మత్యశాఖ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

rice

మన తెలంగాణ/నార్కట్‌పల్లి: చేప పిల్లలు చిన్నవిగా ఉన్నాయని  మత్యశాఖ అధికారులపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నార్కట్‌పల్లి మండ లంలోని అక్కెనపల్లి గ్రామంలో  చేప పిల్లలు పోసేందుకు వచ్చిన ఎమ్మెల్యే  చేప పిల్లలను చూసి చిన్నవిగా ఉన్నాయని ఎప్‌డివో అంజయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులో వదలవ లసిన చేపపిల్లలు ఒక బాక్సులో 50వేలు ఉండాలి కానీ కేవలం ఇందులో 30వేలు మాత్రమే ఉన్నాయి. అనుమానించిన ఎమ్మెల్యే అధికారులతో తిరిగి తన సమక్షంలో లెక్కించగా అందు లో 30వేలు మాత్రమే ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కాగా మత్సశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపిరేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, సర్పంచ్ చిర్రబోయిన కుమారస్వామి, నార్కట్‌పల్లి ఎంపిటిసి మచ్చ ముత్యాలు, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు  సట్టు సత్తయ్య, మండల కార్యదర్శి గాయం శ్యాంసుందర్‌రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఇమ్మయ్య,గ్రామ శాఖ అధ్యక్షుడు యాదయ్య, రామ లింగం,షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments