Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

మత్స పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలి

lady

   ఎంఎల్‌ఎ చిట్టెం రామ్మోహన్‌రెడ్డి 

మన తెలంగాణ/మక్తల్ : నియోజకవర్గంలో రెండు భారీ ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటలు అధికంగా ఉండడంతో మత్స పరిశ్రమ అభివృద్ధి చేసుకుంటే ఈ ప్రాంతంలో మత్స కార్మికులకు జీవనాధారంగా నిలుస్తుందనే ఉద్దేశంతో చేప పిల్లల ను విరివిగా వదుతులున్నామని ఎంఎల్‌ఎ చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గడ్డంపల్లి కృష్ణానదిలో   ఎంఎల్‌ఎ దంపతు లు చేపపిల్లలు వదిలారు.  దీంతో మత్సకార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.  మక్తల్ పెద్ద చెరువు, నర్సిరెడ్డి ప్రాజెక్టులలో ఇప్పటి వరకు 5 లక్షల చేప పిల్లలను వదిలినట్లు తెలిపారు. ఎంఎల్‌ఎ మాట్లాడుతూ మత్స పరిశ్రమపై దృష్టి పెడితే కార్మికులు అభివృద్ధి చెందవచ్చని, అలాగే ప్రభుత్వం అండాగా ఉంటుందని తెలిపారు. మత్స కార్మికులు అధికారులు సూచనలు, సలహాలు తీసుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయని అందుకు తమ సహాయం ఎల్లప్పుడు ఉంటుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నర్సింహ్మగౌడ్, హన్మంతు, సర్పంచ్ గోవర్ధన్‌రెడ్డి, నాయకులు మహిపాల్‌రెడ్డి,  కావలి శ్రీహరి, రాజమహేందర్‌రెడ్డి, రహీం పటేల్, మత్స సంఘం నాయకులు వెంకటేష్, నర్సింహులు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments