Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

సత్ఫలితాలనిస్తోన్న నీలగిరి వనాలు

forest

మనతెలంగాణ/లింగంపేట: ‘పచ్చని చెట్లు  ప్రగతికి మెట్లు’ అనే నానుడిని నిజం చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు.  ఎల్లారెడ్డి అటవీ రేంజ్ పరిధిలోని లింగంపేట మండలంలోని పలు చోట్ల  నీలగిరి వనాలను పెంచి పచ్చదనానికి బాటలు వేస్తున్నారు. 

మనతెలంగాణ/లింగంపేట: ‘పచ్చని చెట్లు  ప్రగతికి మెట్లు ’ అనే నానుడిని నిజం చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు.  ఎల్లారెడ్డి అటవీ రేంజ్ పరిధిలోని లింగంపేట మండలంలోని పలు చోట్ల నీలగిరి వనాలను పెంచి పచ్చదనానికి బాటలు వేస్తున్నారు. అడవులు రోజురోజుకూ అంతరించి పోతుండడంతో పర్యావరణానికి ప్రమాదం పొంచి ఉన్న సమయంలో ప్రభుత్వం అడవులలోని ఖాళీ స్థలాలలో, అటవీ భూములు ఆక్రమణలకు గురైన ప్రాంతాలలో  విరివిగా మొక్కలను నాటి వాటిని సంరక్షించాలనే సదాశయంతో అటవీ శాఖ ఉన్నతాధికారులు రెండేళ్ల క్రితం ప్రణాళికలు తయారు చేసి నీలగిరి మొక్కలను నాటారు. అవి నేడు వృక్షాలుగా మారి సత్ప్ఫలితాలనిస్తున్నాయి. అంతేకాకుండా నేడు  పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. లింగంపేట మండలంలోని నల్లమడుగు గ్రామ శివారులో కంపార్ట్‌మెంట్ నంబర్ 711లో మొక్కలను నాటారు. 2014-15 సంవత్సరంలో అటవీ అభివృద్ధ్ది సంస్థ 13వ పైనాన్స్ నిధులతో పది హెక్టార్లలో (25 ఎకరాలలో) 16వేల 600 నీలగిరి మొక్కలను సెమి మెకానికల్ మెథడ్‌లో కూలీలతో నాటించారు. కాగా నేడు నీలగిరి ప్లాంటేషన్  వనంలా మారిపోయింది. అలాగే మండలంలోని ఎల్లారం, బూరుగిద్ద ప్రాంతాలలో సైతం నీలగిరి మొక్కలను నాటించారు. అం తే కాకుండా తెలంగాణ హరితహారంలో భా గంగా కూడా అటవీ అధికారులు మండలం లో వేలాది మొక్కలను నాటించారు. ఎల్లారెడ్డి అటవీ రేంజ్ పరిధిలోని పలు సెక్షన్‌ల లో పచ్చని చెట్లు అంతరించిపోతుండగా   అడవుల పెంపకానికి చేపడుతున్న ప్లాంటేషన్ పనులు ఫలితాలనిస్తున్నాయి.

Comments

comments