Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

రైతాంగం పొట్టగొడుతున్నకెసిఆర్ సర్కార్

cong

మనతెలంగాణ/నిజామాబాద్ బ్యూరో

నిజామాబాద్ జిల్లా రైతుల పంటలను ఎండబెట్టి, ఇతర జిల్లాలకు నీటిని తరలించి జిల్లా రైతాంగము పొట్టగొడ్తున్న తెలంగాణ సర్కార్ ఏకపక్ష నిర్ణయాలను అడ్డుకుంటామని ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి పి. సుదర్శ న్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో తమ ప్రభుత్వం ప్రాణహితచేవెళ్ల ప్రాజెక్టు ఆయకట్టులోకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అనేక గ్రామాలకు నీటి పారుదల జరిగేలా, నీటి లబ్ధిలేని గ్రామాలకు సైతం నీరందేలా పథక రచన చేస్తే, టిఆర్‌ఎస్ ప్రభుత్వం దాన్ని తుంగలో తొక్కి, కాళేశ్వరం ప్రాజెక్టు అంటూ కొత్త పల్లవిని అందుకొని నిజామాబాద్ రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తోందని ఆయన విమర్శించారు. గతంలో నిజామా బాద్ జిల్లా వరప్ర దాయనియైనా నిజాం సాగర్ ప్రాజెక్టు ఇసుక మేటలతో పూడిపోగా, ఇసుక మేటలను నివారించి, ప్రాజెక్టును రక్షించుకోవడానికి సింగురూ ప్రాజెక్టు రూప కల్పన చేసారని, సింగూరు జల్లుల్లో నిజామా బాద్‌కు వాటా కల్పించారని, అప్పటి నిబంధ నలు, సంప్రదాయాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ముఖ్యమంత్రి వ్యవహరి స్తున్నాడని సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. బ్యాక్ వాటర్ పేరిట నిజా మాబాద్ జిల్లాకు పైప్‌లైను ద్వారా నీరిస్తామని, కరీంనగర్ తదితర ప్రాంతాలకు గ్రావిటి ద్వారా నీరిస్తామని చెప్పడం చూస్తుంటే ఒకరి కడు పుకొట్టి మరొకరికి పెట్టినట్టుందని అన్నారు. గత ఏడాది నిజాం సాగర్ క్రింద 2 లక్షల 75 ఎకరాల సాగు జరుగగా పంటల చివరి దశలో నీరు అందించలేని పరి స్థితి ఏర్పడగా, తాగునీటికి లేకుండా నీటిని పంటల కోసం వదలాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 17 న్నర టిఎంసిలు నీటితో లక్షన్నర ఎకరాలు కూడా సాగుకాదని అన్నా రు. ఇటీవల జరిగిన ఐడిబి సమావేశంలో ఈ జిల్లా నుండి ఎన్నికైనా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కరు కూడా నిజాంసాగర్ కింద ఆయకట్టు పరిస్థితి ఏమిటని అడిగిన పాపాన పోలేదని, ప్రాజెక్టు నిర్మించి 80 యేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు సింగూరు జలాలను మళ్లించే పరిస్థితి  లేదని, ఈ ప్రాజెక్టు పరిధిలోని నిజామాబాద్, మెదక్ జిల్లా వాసులకు మాత్రమే, వాడుకు నేలా పరిమితం చేసారని, కాలానుగుణంగా మిడ్ మానేర్ లోకి 15 టిఎంసిల నీటిని నింపేందుకు ప్రభుత్వం కుట్రల కు తెరలేపిందని మాజీ మంత్రి విమర్శించారు. నిజాం సాగర్ జలాల కోసం ఉద్యమిస్తున్న తమకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని, ఈయేడు యాసంగి పంటకు డోకా లేదని భావిస్తున్న రైతాంగము ఆశల మీద నీళ్ళు జల్లారని విమర్శించారు. సింగూరు జలాలు నిజామాబాద్ ప్రజల హక్కని, దాని కొరకు ఏలాంటి పోరాటాలకైనా సిద్దమని మాజీ మంత్రి చెప్పారు. ఒకవైపు సాగునీరు దోపిడి జరుగు తుండగా మరోవైపు రైతాంగముకు కావాల్సిన వ్యవసాయ పనిముట్లు, పరికరాలు, డ్రిప్, స్పింకర్లు మొదలగు వాటిపై జిఎస్టీ పన్నుపోటుతో రేట్లు అమాంతంగా పెరిగిపోయి రైతులు కోలుకోలేని విధంగా దెబ్బ కొడ్తున్నారని, రైతులకు సబ్సిడి ఇవ్వక, గిట్టుబాటు ధరలు కల్పించక ఈ ప్రభుత్వం ఏం చేయదలచుకున్నాయని మాజీ మంత్రి ప్రశ్నించారు. అలీసాగర్, ఎత్తిపోతల పథకం కొనసాగవలసిందేనని, ప్రస్తుతం ఉన్న నిర్మాణాలన్ని 9 పీట్లు ఎత్తు పెంచడం ద్వారా మరో 50వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకా శం ఉందని, నిజామాబాద్, బోధన్ పట్టణాలకు 1 సంవ త్సరం పాటు త్రాగునీటి లభ్యత ఉంటుందని మాజీ మంత్రి చెప్పారు. ప్రాణహిత, చేవెళ్ల పథకానికి తూట్లుపొడిచి తమ ప్రాంత రైతాంగం పొట్టకొడ్తనంటే చూస్తు ఉర్కోబోమని సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో డిసిసి అధ్యక్షుడు తాహెర్‌బిన్‌హందాన్, పిసిసి కార్యదర్శి గడుగు గంగాధర్, పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అంతరెడ్డి రాజరెడ్డి, నవీపేట జడ్పిటిసి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments