Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

ప్రజల కోరిక మేరకే టిఆర్‌ఎస్‌లోకి : కంచర్ల

ktr

మన తెలంగాణ/ నల్లగొండ ప్రతినిధి: భారీ అనుచర గణంతో కంచర్ల భూపాల్ రెడ్డి సోమవారం మంత్రి కేటి ఆర్, ఈటెల రాజేందర్  సమక్షం లో టీఆర్‌ఎస్‌లో చేరారు. టిఆర్‌ఎస్‌లో చేరిన మరుక్షణంలోనే నల్లగొండ టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జీగా కంచర్ల భూపాల్‌రెడ్డిని నియమి స్తున్నట్లు ఆర్ధిక మంత్రి ఈటెల రాజేం దర్ వేదికపై ప్రకటించారు.  ఈ సందర్భంగా కంచర్ల భూపాల్‌రెడ్డి మా ట్లాడుతూ 2014లో టిడిపి తనక టికెట్ ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. స్వతంత్ర అభ్యర్దిగా పోటిచేసి మెజారిటీ ఓట్లు  సాధించామన్నారు. చెయ్యలేని వాడు ఏంచే స్తాడని కోమటిరెడ్డి మాట్లాడుతున్నాడని నల్లగొండ నడిబొడ్డున గులాబి జెండా ఎగరేస్తామని అన్నారు. కోమ టిరెడ్డి నియోజకవర్గానికి శనిలా దాపురించాడని, కోమటిరె డ్డిని నల్లగొండ నుంచి తరిమి కొట్టడమే లక్షమని అన్నా రు. కంచర్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత35 ఏళ్ళు ఆ తార క రామునికి సేవ చేశామని, ఇక నుండి ఈ తారక రామారావు(కేటిఆర్) కోసం పని చేస్తామని అన్నారు.  అంతకు ముందు పార్టీలో చేరేందుకు నల్లగొండ, నకి రేకల్, నియోజక వర్గాల, జిల్లాలోని ఇతర ప్రాంతాల నుండి వేలాది మంది అను చరులు, వందలాది వాహనాలలో కంచర్ల సోదరుల వెంట హైద్రాబాద్‌కు తరలి వెళ్ళారు. నల్లగొండ ఎన్జీ కళాశాల నుండి  బయలు దేరిన వాహనాలు పంతంగి టోల్‌గేట్ వద్దకు చేరిన వాహనశ్రేణి కలుపుకొని తెలంగాణ భవన్‌కు చేరారు.   ఎంఆర్‌పిఎస్ కార్యకర్త ఆత్మహాత్యకు పాల్పడటంతో సిఎం కెసిఆర్ హుటా హుటిన ఉస్మానియాకు తరలి వెళ్ళడంతో మంత్రులు కెటిఆర్, రాజేందర్‌ల సమక్షంలో భూపాల్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరారు. కంచర్ల వెంట పార్టీ మారిన టీడిపి ముఖ్యులలో జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు మధు సూధన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎండి. ఫహీద్, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి రాం రెడ్డి, జిల్లా కార్యదర్శి జనార్ధన్ రావు, భాస్కర్‌గౌడ్, టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు సైదిరెడ్డి, నల్లగొండ పట్టణ టిడిపి అధ్యక్షులు పిల్లి రామరాజు, కనగల్ మండల పార్టీ అధ్యక్షులు పి. యాదయ్యగౌడ్, తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు టి. గోవర్ధన్, నల్లగొండ మం డల పార్టీ అధ్యక్షులు డి.వెంకట్‌రెడ్డి, నల్లగొండ వార్డు కౌన్సిలర్‌లు షేక్ మోహిన్, యుగేందర్ రెడ్డి,  కాకుల కొండారం ఎంపిటీసి మల్లేష్‌గౌడ్, దుప్ప లపల్లి లలిత, పజ్జూరు ఎంపిటీసి దామోదర్‌రెడ్డి, రామ చంద్రా పురం సర్పంచ్ మల్లయ్యగౌడ్, బోయనపల్లి సర్పంచ్ యాదయ్యలు వున్నారు.

Comments

comments