Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

లాభాలకు ప్రాధాన్యం..సేవలపై నిర్లక్షం

BUS

అర్థం కాని ఆర్టీసీ వైఖరి

ప్రైవేట్ గుప్పిట్లోకి ఒక్కో విభాగం
ఒక్కో క్యాట్ కార్డుపై 30 రూపాయల బాదుడు
బస్టాండ్లలో కరువైన సురక్షిత తాగు నీరు

ప్రజలందరికీ రవాణా సౌకర్యం కల్పించాల్సిన ఆర్టీసీ అందుకు భిన్నంగా ఆదాయానికే ప్రాధాన్యతనిస్తుండడం విమర్శలకు తావిస్తోం ది. ఆర్టీసీ డిపోలోని కీలక విభాగాలన్ని ఇప్పటికే ప్రైవేటు పరం చేసిన ఆ సంస్థ బస్టాండ్‌ల లో సైతం మరికొన్ని విభాగాలను ప్రైవేటుకు అ ప్పగించింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోలలో ఉన్న బస్సుల సంఖ్య ప్రైవేటు గుప్పిట్లోనే ఎక్కువగా ఉన్నాయి. సంస్థ బస్సులు కా లం చెల్లిపోయినప్పటికీ వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయకుండా అద్దె బస్సులకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఆర్టీసీ నడుపుతున్న అద్దె బస్సుల్లో నైపుణ్యం అంతగా లేని డ్రైవర్‌లను నియమిస్తుండడం ప్రమాదాలకు కారణమవుతోందంటున్నారు. బస్టాండ్‌లలో కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయంటున్నారు. ప్రయాణీకులకు సౌకర్యాలు కల్పించకుండా ఆ ప్రాంగణమంతా ప్రైవేటు దుకాణాలు, ప్రకటనలతో గందరగోళాన్ని సృష్టిస్తోందంటున్నారు. ఆదాయమే పరమావధిగా కొనసాగుతున్న ఆర్టీ సీ బస్టాండ్‌లలో ప్రయాణీకులకు కనీస సురక్షిత తాగు నీరు అందించలేకపోతుందన్న విమర్శలున్నాయి. తాగు నీటి కోసం గ్రామీణ ప్రాంతాల జనం కష్టాలు పడుతున్నారు. గతి లేక వారంతా గడువు తీరిన ప్యాకెట్ నీళ్లను తాగి దాహం తీర్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రయాణీకులకు ఆర్టీసీ అందిస్తున్న క్యాట్ కార్డ్ జారీలో కూడా ఆ సంస్థ కక్కుర్తి పడుతున్నట్లు విమర్శలున్నాయి. ఒక్కో క్యాట్ కార్డుకు రూ. 30 అదనంగా  వసూలు  చేస్తున్నట్లు చెబుతున్నారు. క్యాట్ కార్డ్ జారీ వ్యవస్థను ప్రైవేటు పరం చేయడంతో ఆ ప్రైవేటు సంస్థకు చెల్లించేందుకోసం అదనంగా 30 రూపాయలను ప్రయాణికుల నుంచి వసూలు చేస్తుండడం గమానార్హం. దీనికి తోడుగా డీపోలలో ఇంధన విభాగంతో పాటు బస్సు క్లీనింగ్, మెయింటనెన్స్ లాంటి విభాగాలను ప్రైవేటే కాంట్రాక్టర్‌లకు అప్పచెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీ డీపోలలో కొత్త నియామకాలన్ని స్థంబించిపోయాయి. క్రమంగా ప్రతీ విభాగాన్ని ప్రైవేటుకు అప్పజెప్పుడుతండడంతో ఆ సంస్థ రాను రాను నిర్వీర్యమయ్యే ప్రమాదానికి లోనవుతుందంటున్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీకి సంబంధించిన భూములన్నింటినీ క్రమంగా ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు సైతం నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఇటీవల భూముల లీజుకు సంబంధించి టెండర్ ప్రక్రియ కూడా నిర్వహించారు. బస్టాండ్‌లకు ఆనుకొని ఉన్న ఈ స్థలాలలో మల్టిఫ్లెక్స్‌లు నిర్మించే వారికి ప్రాధాన్యతనివ్వనున్నట్లు ఆ సంస్థ ప్రకటిస్తోంది. ఇలా పూర్తి స్థాయిలో ఆర్టీసీ సంస్థను సేవల వైపు నుంచి ఆదాయమే పరమావధిగా మార్చే వ్యవస్థగా రూపొందిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Comments

comments