Search
Thursday 22 February 2018
  • :
  • :
Latest News

అప్పుల బాధ భరించలేక తల్లికి విషమిచ్చి యువకుడి ఆత్మహత్య

MALE-death-body

మనతెలంగాణ/కోరుట్ల:కోరుట్ల మండలం గుమ్లాపూర్ గ్రా మానికి చెందిన మారం శ్రీనివాస్‌రెడ్డి(38) అప్పుల బాధ భ రించ లేక పక్షవాతంతో మంచాన పడ్డ తల్లి నీలమ్మ అలియా స్ రెడ్డమ్మ(70)కు గురువారం విషమిచ్చి తాను ఇంటి దూ లానికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాలుపడ్డాడు. శ్రీనివాస్ రెడ్డి గతంలో ట్రాక్టర్ కొనుక్కొని అప్పుల బారిన పడగా ట్రా క్టర్‌తో లాభం రాక అప్పులు పెరగడంతో ట్రాక్టర్‌తో పాటు త న సొంత ఇంటిని అమ్మినా అప్పు తీరక పోగా తాను ఉం డ టానికి ఇల్లు అద్దెకు దోరకకపోవడంతో కలత చెందిన శ్రీని వాస్‌గురువారంపిల్లలతో భార్య కోరుట్లకు వెళ్ళిన సమయం చూసి పక్షవాతంతో మంచాన పడ్డ తల్లికి విషమిచ్చి తా ను ఇంటి దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నా డు. తన ఇ ద్దరు ఆడ పిల్లలతో సాయంత్రం కోరుట్ల నుండి వచ్చిన శ్రీని వాస్ భార్య తిరుమల ఎంత ప్రయత్నించినా తలుపులు తెర్చుకో కపోవడంతో చుట్టు పక్కలవారిని పిల్చి తలుపులు తె రువగా ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాసును చూసిన గ్రా మ స్తులు పోలీసులకు సమాచారం అందించడంతో కోరుట్ల ఎస్‌ఐ కృష్ణకుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రాణాపా య స్థితిలో ఉన్న శ్రీనివాస్ తల్లి నీలమ్మను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించికేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments