Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

పేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది

ktr

మంత్రి కే తారక రామారావు

మన తెలంగాణ/సిరిసిల్ల: నిరుపేదల సంక్షే మానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథ కాలు అమలు చేస్తోందని, పేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కే తారక రామారావు అన్నారు.  రాజన్న సిరిసి ల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం, జిల్లెల్ల గ్రామం ఎక్స్ రోడ్ నుండి ముస్తాబాద్ వరకు నిర్మించే డబుల్ రోడ్డు పనులను, అంకిరెడ్డిపల్లె సబ్ స్టేషన్‌ను, రోడ్డు పనులను, మహిళా, యాదవ సంఘ భవనాలను, తంగళ్లపల్లి నుండి తురక పల్లి వరకు డబుల్ రోడ్డు పనులను ప్రారంభిం చిన అనంతరం రామచంద్రాపూర్‌లో నిరుపేద వృద్ధురాలు మేడిపల్లి లీలవ్వ నూతన గృహప్ర వేశ కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటిఆర్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రామచంద్రా పూర్‌కు చెందిన నిరుపేద అనాధ లీలవ్వకు ఇంటిని మంత్రి సొంత నిధులతో నిర్మించి ఇచ్చిన నేపథ్యంలో గృహప్రవేశానికి హాజర య్యారు.  ఈ సందర్భంగా తెలంగాణ ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజా సంక్షేమంలో దేశం లోనే తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. ప్రజల కష్టాలను తీర్చేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని, పేదల మొఖాల్లో సంతోషం చూడటమే లక్షంగా తమ ప్రభు త్వం పని చేస్తోందన్నారు. గతంలో ఏ ప్రభు త్వం చేయని అభివృద్ధి పనులు ప్రభుత్వం అమలు చేస్తోందని, సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. తాగునీరు, సాగునీరు అందించడ మే లక్షంగా ప్రాజెక్టుల నిర్మాణాలు సాగిస్తు న్నామన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించా లని చూసినా తాము ప్రజా సంక్షేమం దృష్టా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు. వ్యవసా యానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తు న్నామని, రైతులకు పంటకు 4 వేల రూపాయలు అందిస్తున్నామని వివరించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం  పనితీరుకు ప్రజల నుండి మద్దతు లభిస్తోందని, ముఖ్యమంత్రికి ప్రజలు వెన్నంటి నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, జడ్‌పిటిసి పుర్మాణి మంజుల, ఎంపిపి జూపల్లి శ్రీలత, ఎఎంసి చైర్మన్ జిందం చక్రపాణి, సెస్ చైర్మన్ లకా్ష్మరెడ్డి, సెస్ మాజీ చైర్మన్ చిక్కాల రామారావు, సర్పంచులు, ఎంపిటిసిలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ వరిధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని,అంగన్‌వాడీ కేంద్రాన్నిపరిశీలించారు.

Comments

comments