Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

ప్రాణం తీసిన భూ వివాదం

jngm

యువకుడిని నరికి చంపిన బాబాయిలు
మరో ముగ్గురికి తీవ్రగాయాలు
జనగామ జిల్లా గూడూరులో విషాదం
పాలకుర్తి: భూ తగాదాలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న ఘటన జనగామ జి ల్లా పాలకుర్తి మండలం గూడూరులో విషాదం నింపింది. మృతుడి బంధువులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పెల్లి రాజ్‌కుమార్ (28) బుధవారం తమకున్న రెండెకరాల పొలంలో వరి కోయించేందుకు కు టుంబసభ్యులతో కలిసి వెళ్లాడు. విషయం తెలు సుకున్న రాజ్‌కుమార్ బాబాయిలు వరికోత మిషన్‌ను వెనక్కు పంపి అడ్డుకున్నారు. ఈ భూ మి కోర్టు కేసులో ఉందని, ఎందుకు పంటను కోస్తున్నారని నిలదీశారు. ఇద్దరి మధ్య మాట మాటా పెరగడంతో గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో రాజ్‌కుమార్‌పై వెంట తెచ్చుకున్న గొడ్డళ్లు, కర్రలు, ఇనుపరాడ్లతో కొట్టి హత్య చేశారు. అంతటితో ఆగకుండా రాజ్‌కుమార్ తండ్రి వెంకటయ్య, తల్లి భూలక్ష్మి, సోదరుడు అనిల్ కుమార్‌పై దాడి చేయడంతో వారు అక్కడి నుంచి పరుగెత్తి గ్రామస్తులు, పోలీసుల కు సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో వెంకటయ్య, అనిల్ కుమార్ పరిస్థితి విషమిం చడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎం జిఎం ఆసుపత్రికి తరలించారు. వర్ధన్నపేట ఎసిపి మధుసూదన్, ఇన్‌చార్జి సిఐ ఆదినారా యణ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ ఆదినారాయణ తెలిపారు.

Comments

comments