Search
Tuesday 12 December 2017
  • :
  • :
Latest News

కాగజ్‌నగర్‌లో దొంగల ముఠా భారీ దోపిడీ

Robbery

కుమ్రం భీం ఆసిఫాబాద్: జిల్లా కాగజ్‌నగర్‌లోని రాజరాజేశ్వర రైసుమిల్లులో సోమవారం రాత్రి అంతర్రాష్ట్ర దొంగల ముఠా భారీ దోపిడీకి పాల్పడింది. మిలిటరీ దుస్తుల్లో వచ్చిన దొంగలు రైస్‌మిల్లులోకి చొరబడ్డారు. అనంతరం సిబ్బందిని బెదిరించి రూ.16 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. దీంతో రైసుమిల్లు యజమానులు పోలీసులకు సమాచారమిచ్చారు. దాంతో పోలీసులు ఆ ప్రాంతంలోని అన్ని పిఎస్‌లకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశారు. పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టి సిర్పూర్(టి) పోలీస్‌స్టేషన్ వద్ద 12 మంది దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. కాగజ్‌నగర్ డిఎస్‌పి హబీబ్‌ఖాన్ ఆధ్వర్యంలో దొంగల ముఠా సభ్యుల విచారణ కొనసాగుతోంది.

Comments

comments