Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

ఈ ప్రయాణం ప్రమాదభరితం

danger

*చుట్టూ వాగులు.. అన్ని కాలాలు తిప్పలే

*రోగం వస్తే .. అరిగోసే 

*పట్టాల మధ్యలో ప్రాణంతక ప్రయాణం

*మామిడిగూడెం గ్రామ ప్రజల ఆవేదన

మనతెలంగాణ/కాసిపేట : మండలంలోనిఎన్నో మారుమూల గ్రామాలు నేటికి రవాణా సౌకర్యానికి నోచుకోకుండా వున్నాయి. మామిడిగూడెం గ్రామ ప్రజలు వందల సంఖ్యలో జ్వర పీడితులు కావడంతో గ్రామానికి వెళ్లేందుకు అధికార గణం అష్ట కష్టాలు పడుతున్నారు. కారణం ఈ గ్రామానికి వెళ్లాలంటే వాగులో నుండే వెళ్లాలి. వాగులో నీరు ఎప్పుడు పారుతూనే వుంటుంది. ఇది మంచిర్యాల జిల్లా కాసిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని మామిడిగూడెం. ఇక్కడ వంద శాతం గిరిజనులే(లంబాడిలు) వున్నారు. మామిడిగూడెం ప్రజల జీవన విధానం రెండు మండలాలతో ముడి పడివుంది. వారు నిత్యవసర వస్తువులు ఇతర సమస్యల పరిష్కారానికి మందమర్రి పట్టణం మీద ఆదారపడివుంటారు. అలాగే స్థానికంగా కాసిపేట మండలం కాగా ఏ అవసరం వచ్చిన కాసిపేట మండలంపై ఆధార పడుతుంటారు. కాసిపేటకు రావాలంటే కాసిపేట అశోక్ నగర్ వద్ద కూడా వాగు దాటితేనే వారి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వర్షాకాలం వచ్చిందంటే ఈ ఊరికి బయటి ప్రపంచంతో సంబందాలు తెగిపోతాయి. ఒకవేళ తప్పని పరిస్థితిలో వెళ్లాలంటే మాత్రం ఓరియంట్ సిమెంట్ కంపెనీ నుండి వెళ్లే రైలు లైన్ బ్రిడ్జిపై నుండి ప్రయాణాలను అరచేతిలో పెట్టుకునే వెళ్లాల్సిందే. కొందరు వ్యాపారం చేసేవారు సాహసించి పట్టాల మధ్యలో ద్విచక్ర వాహనాలు నడుపుకుంటూ, అలాగే రైల్వే లైన్ పట్టాల మధ్యలోవున్న చిన్న ప్లేట్‌పై నుండి సామానుతో ప్రయాణానికి సహాసం చేస్తుంటారు. ఈ సాహాస యాత్రలో కూడా రెండు మూడు సంఘటనల్లో వాగులో పడిపోయి క్షతగాత్రులుగా మారారు.
మామిడిగూడెం గ్రామసమస్యలపై విన్న విస్తే చిన్న చూపు చూస్తున్నారని బంజారా సేవసంఘం మండల అధ్యక్షులు అజ్మీర చందు పేర్కొన్నారు. వాగుపై వంతెనకు నిధులు మంజూరైనట్లు తెలిసిందని కానీ ఒక ప్రజాప్రతినిధి దానిని తరలించుకు పోయాడని ఆయన ఆరోపించారు.
అజ్మీర చందు(మామిడిగూడెం)
తమ గ్రామానికి అధికారులు కాదు కదా ప్రజాప్రతినిధులు కూడా రారని, గ్రామంలో విష జ్వరాలు సోకి ముగ్గురు చనిపోయి, పదుల సంఖ్యలో అనారోగ్యాలకు గురైన తరువాత అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తరలి వస్తున్నారని మహిళలు వాపోయయారు.
మాగ్రామానికి చుట్టు వాగులు వుండడం వల్ల ఎవరికైన రోగం వస్తే దేవుడి మీద బారం వేయాల్సిందేనని వైస్ ఎంపిపి లావుడియా బలరాం పేర్కొన్నారు. గ్రామంలో ఏదైన జరిగితే 108 అంబులెన్సుకు సమచారం ఇచ్చిన రవాణా సౌకర్యం లేదని రావడం లేదంటు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
                                                                                                                                                                                                   బలరాం, కాసిపేట వైస్ ఎంపిపి

Comments

comments