Search
Sunday 20 May 2018
  • :
  • :
Latest News

‘టైగర్ జిందా హై’ ట్రైలర్ రిలీజ్…

Salman-Khanముంబయి: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా తెరకెక్కిన తాజా చిత్రం ‘టైగర్ జిందా హై’. మంగళవారం చిత్ర యూనిట్ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఏక్ థా టైగర్‌కు సీక్వెల్‌గా టైగర్ జిందా హై తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో సల్మాన్ స్టంట్స్ హైలైట్‌గా ఉన్నాయి. మూవీ ఇరాక్ బ్యాక్‌డ్రాప్‌లో… ఉగ్రవాదుల చేతిలో చిక్కుకున్న 25 మంది ఇండియన్ నర్సులను ఎలా రక్షించారు అనే నేపథ్యంలో రూపుదిద్దుకున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సల్లూభాయ్ మరోసారి తనదైన నటన, యాక్షన్‌తో అభిమానులను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. బాలీవుడ్ అగ్ర దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్‌లో యశ్‌రాజ్ ఫిల్మ్ సంస్థ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. విశాల్-శేఖర్ ద్వయం సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ స్టంట్స్ డైరెక్టర్ టామ్ స్ట్రూథర్స్ యాక్షన్ సీక్వెల్స్ అందిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. హై ఓల్టేజీ యాక్షన్ థ్రిల్లర్ టైగర్ జిందా హై ట్రైలర్ మీ కోసం…

Comments

comments